Twitter Employees Can Work From Office Starting March 15 (3)
Twitter employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకూ ఇంట్లో నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని అంటున్నాయి. కరోనా తీవ్రత తగ్గిపోవడంతో ఇంట్లో చేసింది చాలు.. ఆఫీసుల్లోనే పనిచేయొచ్చునని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. గూగుల్ ట్విట్టర్‌తో సహా కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలకు ముగింపు పలుకుతున్నాయి. గూగుల్, ట్విట్టర్‌తో సహా కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలకు ముగింపు పలుకుతున్నాయి.
Google తర్వాత Twitter CEO పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉద్యోగులను ఈ 15 లోపు కార్యాలయానికి ఉద్యోగులందరూ తిరిగి రావాలని కోరారు. ఇప్పటివరకూ మూతపడిన ఆఫీసులన్నీ తిరిగి ప్రారంభమవుతున్నాయని, వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలానే పున:ప్రారంభమవుతాయని, ఇతర ఐటీ కంపెనీల మాదిరిగానే ట్విట్టర్ ఆఫీసులు కూడా మార్చి 15 నుంచి ప్రారంభమవుతాయని అగర్వాల్ ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.
Twitter Employees Can Work From Office Starting March 15
ఇప్పటివరకూ ఉద్యోగుల సౌకర్యం దృష్ట్యా వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించినట్టు తెలిపారు. ట్విట్టర్ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇప్పటికీ అందుబాటులోనే ఉందన్నారు. ఇంట్లో నుంచి పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే.. ఆఫీసు నుంచి పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలకు అర్హులుగా అగర్వాల్ పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ట్విట్టర్ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ ఎదుర్కొన్న సమస్యలను ట్విట్టర్ CEO ప్రధానంగా ప్రస్తావించారు. రానున్న నెలరోజులు ఉద్యోగులకు సవాళ్లతో కూడి ఉంటాయన్నారు.
ఉద్యోగులు మరింత చురుగ్గా ఆఫీసులకు అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక లాజిస్టిక్స్, తేదీలు, భద్రతా చర్యలకు సంబంధించి కంపెనీ ఎలా చర్యలు తీసుకుంటుంది అనే వివరాలను త్వరలో ఉద్యోగులకు తెలియజేస్తామని అగర్వాల్ ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు.. గూగుల్ కూడా తమ ఉద్యోగులను ఏప్రిల్ 4 నుంచి ఆఫీసులకు రావాల్సిందేనని తెలిపింది. హైబ్రిడ్ వర్క్ పాలసీ ఆధారంగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తోంది. అంటే.. అన్ని రోజుల్లో ఆఫీసుల్లో పని చేయనక్కర్లేదు అనమాట..
Read Also : Twitter Warning Label : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఆ పోస్టులకు ఇలా చెక్ పెట్టొచ్చు!