Little Giant : ఇదో అద్భుతం.. ఎలక్ట్రిక్ కార్ల చరిత్రలోనే సరికొత్త రికార్డు

తాజాగా మార్కెట్లోకి వచ్చిన 'లిటిల్ జెయింట్' ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది.

Little Giant

Speed Car : భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించే కారు ఏదని అడిగితే టక్కున గుర్తొచ్చే పేరు ThrustSSC. పెట్రోల్‌తో నడిచే ఈ కారు గంటకు గరిష్టంగా 1227.9 కిలోమీటర్ల వేగంతో వెళ్లి రికార్డు నెలకొల్పింది. ఇక ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హావ నడుస్తుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కార్లకంపెనీలు వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా తయారు చేస్తున్నాయి. వేగం, మైలేజ్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.

చదవండి : Electric Scooter : రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘లిటిల్ జెయింట్’ ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది. ఇటీవల జరిపిన టెస్ట్‌రైడ్‌లో ఈ కారు గంటకు 574.5 కిలోమీటర్ల వేగంతో వెళ్లి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో “Rimac Nevera” ఎలక్ట్రిక్ కారు గంటకు 412 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగా దాని రికార్డును ‘లిటిల్ జెయింట్’ (Little Giant) తుడిచేసింది.

చదవండి : Electric Car : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 750 కి.మీ ప్రయాణం

టీమ్ వెస్కో 444 రీవోల్ట్ సిస్టమ్స్ రూపొందించిన ‘లిటిల్ జెయింట్’ ఎలక్ట్రిక్ వాహనం అమెరికాలో ఫుల్ బ్యాటరీతో నడిచే అత్యంత వేగం గల ఈవీగా రికార్డును బద్దలు కొట్టింది. ఈ లిటిల్ జెయింట్ కారు 1,152 ప్రిస్మాటిక్ లిథియం-అయాన్ బ్యాటరీలతో నడుస్తుంది.