Wrong UPI Transfer
Wrong UPI Transfer : యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? జర జాగ్రత్త.. మీరు యూపీఐ పేమెంట్ రాంగ్ పర్సన్ కు చేస్తే అంతే సంగతులు.. యూపీఐ డబ్బులు తిరిగి పొందడం చాలా కష్టం. ప్రస్తుత రోజుల్లో చాలామంది యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు.
కొన్నిసార్లు మొబైల్ నెంబర్ రాంగ్ టైప్ చేయడం లేదా బ్యాంకు అకౌంట్ తప్పుగా ఎంటర్ చేసి తొందరలో పేమెంట్ చేసేస్తుంటారు. ఇలాంటి సమయంలో డబ్బులు పంపాల్సిన వ్యక్తి కాకుండా మరొకరికి అకౌంట్లలోకి వెళ్తాయి.
అయితే, చాలామందికి ఇలా జరిగితే ఆ డబ్బులు తిరిగి పొందలేమా? అనేది ప్రశ్నార్థకమే. ఇటీవలే దీనిపై టెక్ ఎక్స్ పర్ట్స్ కొన్ని కీలక పాయింట్స్ చెప్పారు. పొరపాటున ఏదైనా రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగితే డబ్బును రికవరీ చేసేందుకు కొన్ని మార్గాల్లో ప్రయత్నించవచ్చు. కానీ, గ్యారెంటీగా రికవరీ అనేది కుదరదని అంటున్నారు. ఇంతకీ ఎలాంటి పేమెంట్ రికవరీ చేయగలరు? ఏ పేమెంట్ చేయలేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాంగ్ యూపీఐ పేమెంట్ చేస్తే ఫస్ట్ ఇలా చేయండి :
మీరు అనుకోకుండా రాంగ్ అకౌంట్ డబ్బు పంపితే.. వెంటనే మీ బ్యాంక్ లేదా యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి. ట్రాన్సాక్షన్ ఐడీ, టైమ్ సమాచారం అందించి ఫిర్యాదు చేయండి. బ్యాంక్ మీ కేసును దర్యాప్తు చేస్తుంది. అది యాక్టివ్‌గా ఉంటే ఇతర అకౌంట్ నుంచి డబ్బును రికవరీ చేసేందుకు ట్రై చేస్తుంది.
ఎన్‌పీసీఐ, బ్యాంకుల రోల్ ఏంటి? :
యూపీఐ లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కంట్రోల్ చేస్తుంది. సకాలంలో కంప్లయింట్ చేస్తే, NPCI, బ్యాంక్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయి. అయితే, డబ్బును పొందే ఖాతాదారుడు సమ్మతిస్తే లేదా బ్యాంక్ దర్యాప్తులో టెక్నికల్ లోపం ఉందని రుజువైతేనే డబ్బును తిరిగి వస్తుంది.
డబ్బు రికవరీ ఎప్పుడు కష్టమంటే? :
యూపీఐ యూజర్లు ఏం చేయాలంటే? :
యూపీఐ పేమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా యూపీఐ తప్పుగా పేమెంట్ చేస్తే వెంటనే ఆ సమస్య గుర్తించి రికవరీ చేసుకోవాలి. బ్యాంకులు, NPCI ద్వారా యూపీఐ రాంగ్ పేమెంట్ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ, రీఫండ్ పూర్తిగా డబ్బులు పొందిన వ్యక్తి సమ్మతి, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రతి లావాదేవీకి ముందు మీ అకౌంట్ వివరాలను జాగ్రత్తగా చెక్ చేయడం మంచిది.