WWDC 2025 : ఆపిల్ కొత్త iOS 26 అప్‌డేట్ ఆగయా.. ఫీచర్లు అదుర్స్.. ఐఫోన్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సపోర్టు చేసే మోడల్స్ ఇవే..!

WWDC 2025 : ఆపిల్ కొత్త iOS 26 బీటా వెర్షన్ అప్‌డేట్ రిలీజ్ అయింది. ఐఫోన్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఏయే మోడల్స్ సపోర్టు చేస్తాయంటే?

WWDC 2025

WWDC 2025 : ఆపిల్ అభిమానుల కోసం కొత్త iOS 26 బీటా అప్‌డేట్ వచ్చేసింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) ఈవెంట్ సందర్భంగా ఆపిల్ iOS 26 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆవిష్కరించింది. ప్రత్యేకించి ఐఫోన్లలో రాబోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్. visionOS నుంచి ప్రేరణతో సరికొత్త డిజైన్ అప్‌డేట్ అందిస్తోంది.

సాధారణంగా iOS అప్‌డేట్‌లకు రిలీజ్ చేసిన సంవత్సరాన్ని చివరిలో పెడుతోంది. కానీ, ఈసారి iOS 19కి బదులుగా 2025లో నేరుగా iOS 26 పేరుతో అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఇంతకీ ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఏయే ఫీచర్లు కలిగి ఉంది? మీ ఐఫోన్ సపోర్టు చేస్తుందా? ముందుగా కొత్త అప్‌డేట్‌ను ఎలా పొందాలా? అని చూస్తున్నారా? అయితే మీకోసం ఫుల్ గైడ్ అందిస్తున్నాం..

Read Also : PMSBY Scheme : చౌకైన ప్రభుత్వ బీమా పథకం.. జస్ట్ రూ. 20కే రూ. 2 లక్షల కవరేజ్.. ఎవరు అర్హులు, ఎలా అప్లయ్ చేయాలంటే?

iOS 26 కొత్త ఫీచర్లు ఇవే :
iOS 26 లిక్విడ్ గ్లాస్ అనే బ్రాండ్-న్యూ డిజైన్ స్టైల్‌ను ప్రవేశపెట్టింది. మీ ఐఫోన్‌కు 3D-వంటి వాల్‌పేపర్‌లు, సీ-త్రూ విడ్జెట్‌లను అందిస్తుంది. iOS 26 ముఖ్య ఫీచర్లు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లిక్విడ్ గ్లాస్ డిజైన్ : మీ ఐఫోన్ ఇప్పుడు 3D మోషన్ వాల్‌పేపర్‌లు, ట్రాన్సపరంట్ ఎఫెక్ట్స్, ఫ్రాస్టెడ్ విడ్జెట్‌లతో మరింత మోడ్రాన్‌గా ఉంటుంది.

ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో స్మార్ట్ ఫీచర్లు : ఆపిల్ లైవ్ ట్రాన్సులేషన్, ఫోటోల ఆధారంగా స్మార్ట్ క్యాలెండర్ సజెషన్స్ సహా కొత్త AI టూల్స్ అందిస్తుంది.

ఫోన్ యాప్ రీవ్యాంప్ : ఫావరెట్స్, రీసెంట్, వాయిస్‌మెయిల్స్ అన్నీ ఇప్పుడు ఒకే చోట ఉంటాయి. కాల్ స్క్రీనింగ్, హోల్డ్ అసిస్ట్ వంటి టూల్స్ కూడా యాక్సస్ చేయొచ్చు.

మెసేజ్‌‌లో కొత్త టూల్స్ : మీరు ఇప్పుడు చాట్ బ్యాక్‌గ్రౌండ్స్ మార్చవచ్చు. గ్రూప్ చాట్‌లలో పోల్‌లను క్రియేట్ చేయొచ్చు. తెలియని పంపేవారిని ఫిల్టర్ చేయవచ్చు. ఏఐ పోల్ ప్రశ్నలను కూడా సూచించవచ్చు.

కొత్త ఆపిల్ గేమ్స్ యాప్ : అన్ని గేమ్‌లు, ఆపిల్ ఆర్కేడ్ కంటెంట్ ఇప్పుడు ఒకే యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. తద్వారా సులభంగా యాక్సస్ చేయొచ్చు.

మ్యాప్స్, కార్‌ప్లే : ఆపిల్ మ్యాప్స్ ఇప్పుడు ప్రదేశాలను చూపిస్తుంది. కార్‌ప్లే కాల్స్ కోసం స్మాల్ నోటిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఎయిర్ ప్యాడ్స్, పేరెంట్స్ కంట్రోలింగ్ : మీరు AirPods ఉపయోగించి ఫోటోలు తీయవచ్చు. క్లియర్ సౌండ్ వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరితో చాట్ చేస్తారు.. ఏమి షేర్ చేస్తున్నారో మానిటర్ చేయొచ్చు.

Read Also : Nothing Phone 3 : అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది.. ధర, లాంచ్ డేట్ వివరాలు లీక్..!

iOS 26కి సపోర్టు చేసే ఐఫోన్ మోడల్స్ :
అన్ని ఐఫోన్‌లకు iOS 26 లభించదు. సపోర్టు చేసే మోడళ్ల జాబితా ఓసారి లుక్కేయండి.

  • ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మాక్స్, 16e
  • ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మాక్స్
  • ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మాక్స్
  • ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మాక్స్
  • ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మాక్స్
  • ఐఫోన్ SE (2020 & 2022)
  • రాబోయే ఐఫోన్ 17 సిరీస్ iOS 26 ప్రీ-ఇన్‌స్టాల్ ఉంటుంది.

iOS 26 బీటాను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? :
మీరు iOS 26 కోసం డెవలపర్ బీటాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బీటాను ఇన్‌స్టాల్ చేసే ముందు ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా ఆపిల్ ఐడీతో ఫ్రీగా సైన్ ఇన్ చేయండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత Settings > General > Software Update > Beta Updates > iOS 26 డెవలపర్ బీటాకు వెళ్లండి. బీటా వెర్షన్లు బగ్గీగా ఉండవచ్చు. ఇన్‌స్టాల్ చేసే ముందు మీ ఐఫోన్‌ను బ్యాకప్ చేసుకోవడం మర్చిపోవద్దు.