PMSBY Scheme : చౌకైన ప్రభుత్వ బీమా పథకం.. జస్ట్ రూ. 20కే రూ. 2 లక్షల కవరేజ్.. ఎవరు అర్హులు, ఎలా అప్లయ్ చేయాలంటే?

PMSBY Scheme : ప్రభుత్వ ప్రమాద బీమా పథకం ఎలా పొందాలి? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏడాదికి ఎంత చెల్లించాలి? ఎంత వరకు కవరేజ్ అందుతుందంటే?

PMSBY Scheme : చౌకైన ప్రభుత్వ బీమా పథకం.. జస్ట్ రూ. 20కే రూ. 2 లక్షల కవరేజ్.. ఎవరు అర్హులు, ఎలా అప్లయ్ చేయాలంటే?

PMSBY Scheme

Updated On : June 9, 2025 / 7:24 PM IST

PMSBY Scheme : ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. భారత ప్రభుత్వం దేశ పౌరుల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపడుతోంది. ప్రస్తుత రోజుల్లో (PMSBY Scheme) ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎవరికైనా డబ్బు ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పలేం. అందుకే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా బీమా ఉండాల్సిందే.

అయితే, బీమా ప్రీమియం చెల్లించలేని వాళ్లు ఉంటారు. అలాంటి పేద, అవసరంలో ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వమే బీమా ప్రయోజనాన్ని అందిస్తోంది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల బీమా రక్షణ పొందవచ్చు. ఈ అద్భుతమైన పథకాన్ని ఎలా పొందాలి? మీ కుటుంబం భవిష్యత్తులో అనిశ్చితుల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Samsung Galaxy Z Flip 6 : అమెజాన్‌ బిగ్ డీల్.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌ జస్ట్ రూ. 61,150కే.. ఇలా కొన్నారంటే?

రూ. 20కి రూ. 2 లక్షల బీమా :
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనేది భారత ప్రభుత్వం అందించే సరసమైన ప్రమాద బీమా పథకం. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తుంది. 2015 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమైంది. ప్రతి వ్యక్తికి, పేద వర్గానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

ఎవరికి బెనిఫిట్స్ ఎక్కువంటే? :
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే.. అతని నామినీకి రూ. 2 లక్షలు అందిస్తారు. అంతేకాదు.. పాలసీదారుడు ప్రమాదం కారణంగా వైకల్యం చెందితే ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందవచ్చు.

పాలసీదారుడు పాక్షికంగా వైకల్యం చెందితే.. అతనికి రూ. 1 లక్ష అందిస్తారు. పాలసీదారుడు పూర్తిగా వికలాంగులైతే.. అతనికి రూ. 2 లక్షల పూర్తి మొత్తం అందిస్తారు. ఈ కవరేజ్ ప్రమాదం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి తనతో పాటు తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

ప్రీమియం పేమెంట్, ప్లాన్ కాల పరిమితి :
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో సంవత్సరానికి రూ. 20 మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దేశంలోని ఏ పౌరుడైనా ఈజీగా ప్రీమియం చెల్లించవచ్చు.
బీమా కవరేజ్ వ్యవధి ప్రతి ఏడాది జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. మీ కవరేజ్ కొనసాగాలంటే ప్రతి ఏడాది జూన్ 1 లోపు మీ ప్రీమియంను చెల్లించాలి.

ఎవరు అప్లయ్ చేయొచ్చు? :
18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. యువత నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరూ బీమా పథకాన్ని పొందవచ్చు.

Read Also : Starlink India Price : అతి త్వరలో భారత్‌కు స్టార్‌లింక్.. నెలకు శాటిలైట్ ప్లాన్ ధర రూ. 3 వేలు.. హార్డ్‌వేర్‌ కాస్ట్ రూ.33వేలు అంట..!

దరఖాస్తు ప్రక్రియ ఇలా :
దరఖాస్తు చేయడం చాలా సులభం. మీ బ్యాంకు లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) విజిట్ చేయడం ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా ప్రీమియం డెబిట్ అవుతుంది. తద్వారా ప్రతి ఏడాదిలో ప్రీమియం చెల్లింపుపై ఆందోళన అవసరం లేదు. మీ బీమా కవరేజ్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి ఏడాది కంటిన్యూ అవుతుంది.