Samsung Galaxy Z Flip 6 : అమెజాన్ బిగ్ డీల్.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ జస్ట్ రూ. 61,150కే.. ఇలా కొన్నారంటే?
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Flip 6
Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 లాంచ్ కానుంది. అంతకన్నా ముందే అమెజాన్‌లో (Samsung Galaxy Z Flip 6) శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 భారీ డిస్కౌంట్లతో సొంతం చేసుకోవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు లేటెస్ట్ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌పై రూ.30వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
మీరు కొత్త ఫ్లిప్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. భారత మార్కెట్లో రూ.1,09,999 ధరకు అందుబాటులో ఉంది. కస్టమర్లు డ్యూయల్ కెమెరా సెటప్, డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, ప్రీమియం ఇన్-హ్యాండ్ ఫీల్‌తో పాటు గెలాక్సీ ఏఐ ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది . అమెజాన్‌లో ఈ గెలాక్సీ Z ఫ్లిప్ 6 డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర రూ.79,891కి కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ.1,09,999 నుంచి తగ్గింపు పొందవచ్చు. అయితే, మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఫోల్డబుల్ ఫోన్ రూ.1,200 కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు. దాంతో ఫోన్ ధర రూ.78వేల కన్నా తగ్గుతుంది.
కస్టమర్లు నెలకు రూ.3,873 ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్ బట్టి రూ. 61,150 వరకు వాల్యూను పొందవచ్చు. కొనుగోలుదారులు అదనంగా చెల్లిస్తే.. స్క్రీన్ డ్యామేజ్, ఇతర ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 3.4-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్టుతో ఇస్తుంది. బాక్స్ వెలుపల వన్ యూఐ7తో వస్తుంది. కెమెరా విభాగం విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సెటప్, 10MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.