Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్.. ఈ బిగ్ డీల్ అసలు వదులుకోవద్దు!

Google Pixel 9 Pro Fold : పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మడతబెట్టే ఫోన్ కావాలా? విజయ్ సేల్స్ రూ. 30వేలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్.. ఈ బిగ్ డీల్ అసలు వదులుకోవద్దు!

Google Pixel 9 Pro Fold

Updated On : June 9, 2025 / 5:44 PM IST

Google Pixel 9 Pro Fold : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అయితే మీకోసం పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. విజయ్ సేల్స్ (Google Pixel 9 Pro Fold) ద్వారా ఈ ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 30వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పటివరకు ఈ ఫోన్ కొనుగోలుపై ఇదే బిగ్ డీల్. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇంతకీ ఈ మడతబెట్టే ఫోన్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Read Also :  Motorola Edge 60 Launch : పిచ్చెక్కించే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంత ఉండొచ్చంటే?

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో పిక్సెల్ 9 ప్రో రూ.1,72,999కు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.1,52,999కు లిస్టు అయింది. రిటైలర్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నో-కాస్ట్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.10వేలు తగ్గింపును పొందవచ్చు.

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 6.3-అంగుళాల OLED ఔటర్ డిస్‌ప్లేతో పాటు 1080×2424 పిక్సెల్‌ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది.

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. యాడ్ మీ, ఆటో ఫ్రేమ్, పిక్సెల్ వెదర్ యాప్, మ్యాజిక్ లిస్ట్, స్క్రీన్‌షాట్ యాప్, పిక్సెల్ స్టూడియో, క్లియర్ కాలింగ్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Poco F7 Launch : అద్భుతమైన ఫీచర్లతో పోకో F7 ఫోన్ వచ్చేస్తోంది.. లాంట్ టైమ్‌లైన్, డిజైన్, స్పెషిఫికేషన్లు, ధర వివరాలివే..!

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. OISతో 48MP మెయిన్ సెన్సార్, 10.5MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో కెమెరా. బయటి లోపలి స్క్రీన్లు రెండింటిలోనూ సెల్ఫీలు, వీడియోల కోసం 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇంకా, పిక్సెల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4650mAh బ్యాటరీని కలిగి ఉంది.