Motorola Edge 60 Launch : పిచ్చెక్కించే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంత ఉండొచ్చంటే?
Motorola Edge 60 Launch : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ ఈ నెల 10న భారత మార్కె్ట్లో లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Motorola Edge 60 Launch
Motorola Edge 60 Launch : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే జూన్ 10న మోటోరోలా అధికారికంగా లేటెస్ట్ లైనప్‌ను ఎడ్జ్ 60 లాంచ్ చేయనుంది. ఇప్పటికే, భారతీయ మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 ప్రో అందుబాటులో ఉన్నాయి. మోటో ఏఐ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.
రాబోయే మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ మిలిటరీ-గ్రేడ్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP68 రేటింగ్‌ను కూడా అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 60 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర రేంజ్, డిజైన్ వంటి మరిన్ని ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 లాంచ్ తేదీ :
జూన్ 10న మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. భారత కాలమానం ప్రకారం.. ఈ మోటోరోలా ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50కు దీనికి పెద్దగా తేడా లేదు. స్మార్ట్‌ఫోన్ స్క్వేరిష్ కెమెరా మాడ్యూల్ లెన్స్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ మోటోరోలా ఫోన్ పంచ్-హోల్ కటౌట్‌తో కర్వడ్ స్క్రీన్ కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 1,400 నిట్స్ గరిష్ట ప్రకాశంతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా అందించవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్, మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లేటెస్ట్ హాలోయూఐ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. అనేక ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.
Read Also : Post Office Scheme : మీకు జీతం పడిందా? పోస్టాఫీసులో ఇలా పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో లక్షాధికారి అయిపోవచ్చు..!
5,500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ బ్లూటూత్ వెర్షన్ 5.4, WiFi 6ని కూడా పొందవచ్చు. కెమెరాల విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ LYT700C సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను పొందుతుందని భావిస్తున్నారు. 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 60 ధర (అంచనా) :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ధర దాదాపు రూ.23వేలు ఉంటుందని అంచనా. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ ధర మరింత ఎక్కువగా ఉండవచ్చు.