Starlink India Price : అతి త్వరలో భారత్‌కు స్టార్‌లింక్.. నెలకు శాటిలైట్ ప్లాన్ ధర రూ. 3 వేలు.. హార్డ్‌వేర్ కాస్ట్ రూ.33వేలు అంట..!
Starlink India Price : భారత్‌లో స్టార్ లింక్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో నెలవారీ ప్లాన్ ధరలు రూ. 3వేల నుంచి ప్రారంభం కానున్నాయి.

Starlink India Price
Starlink India Price : మన ఇండియాకు స్టార్‌లింక్ వచ్చేస్తోంది.. ఇకపై శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను వేగంగా పొందవచ్చు. అతి త్వరలో భారత టెలికం మార్కెట్లో శాటిలైట్ ఆధారిత (Starlink India Price) ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించేందుకు స్టార్ లింక్ రెడీ అవుతోంది. ప్రపంచ బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు ఈ స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసులను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి కీలక లైసెన్స్ పొందింది. భారతీ ఎయిర్‌టెల్‌కు వన్‌వెబ్, రిలయన్స్ జియో సైతం అనుమతులు పొందింది. స్టార్ లింక్ సర్వీసు ధరలు ఎంత ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే, వంద దేశాలకు పైగా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను స్టార్‌లింక్ అందిస్తోంది. బంగ్లాదేశ్‌లోనూ శాటిలైట్ డేటా సర్వీసులను ప్రారంభించింది. హార్డ్‌వేర్ డేటా రిసీవర్ ధరను రూ.33 వేలుగా నిర్ణయించింది. నెలవారీ ప్లాన్ ధరలు రూ.3 వేల నుంచి ప్రారంభం అవుతాయి.
స్టార్‌లింక్ ఇండియా ధరలపై ప్రారంభ అంచనాలు మారుతున్నాయి. స్టార్‌లింక్ ఇండియా మాజీ అధిపతి సంజయ్ భార్గవ మొదటి ఏడాదిలో ఖర్చు రూ. 1.58 లక్షలుగా అంచనా వేశారు. ఆ తరువాతి సంవత్సరాల్లో రూ. 1.15 లక్షలకు తగ్గుతుంది. కొత్త గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ ధరల మాదిరిగానే భారత్‌లోనూ ఉంటాయని భావిస్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లోకి స్టార్‌లింక్ :
జియో, ఎయిర్‌టెల్, BSNL టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తున్నాయి. అందులోనూ ఫ్రీ ఇన్‌స్టలేషన్ సర్వీసు కూడా ఇస్తున్నాయి. 100Mbps స్పీడ్ అన్‌లిమిటెడ్ డేటాను కేవలం రూ. 1000 లోపే ఆఫర్ చేస్తున్నాయి. అలాగే OTT, టీవీ బెనిఫిట్స్ అదనంగా పొందవచ్చు. వీటితో పోలిస్తే.. స్టార్ లింక్ ధర ఎక్కువే. టెలికాం సిగ్నల్స్ అందని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో కూడా స్టార్ లింక్ సర్వీసులను పొందవచ్చు.
లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ల ద్వారా సర్వీసులను అందిస్తోంది. 600Gbps నుంచి 700 Gbps బ్యాండ్‌విడ్త్‌ను అందించాలని యోచిస్తోంది. భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఉండే ఈ శాటిలైట్లు స్టార్‌లింక్‌కు 7వేలు ఉన్నాయి.
అయితే, ఈ శాటిలైట్ల సంఖ్యను 40వేలకు పెంచనుంది. లైసెన్స్ ఉన్న కంపెనీలు, కమర్షియల్ శాట్‌కామ్ స్పెక్ట్రమ్ పొందాలంటే ఇంకా సమయం ఉంది. ఈ సర్వీసుకు సంబంధించి స్పెక్ట్రమ్ ధరల నిబంధనలు, షరతులపై ట్రాయ్ ప్రభుత్వానికి సిఫారసులను పంపింది.
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ సర్వీసులను ప్రారంభించగలవు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ నుంచి కూడా అనుమతులు పొందాలి. మౌలిక సదుపాయాలు కూడా తప్పనిసరి. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులకు ఇంకా సమయం పట్టొచ్చు.
ఆసియాలో స్టార్‌లింక్ విస్తరణ వేగవంతం :
ప్రస్తుతం జపాన్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి ఎంపిక చేసిన ఆసియా దేశాలలో స్టార్‌లింక్ శాటిలైట్ డేటా సర్వీసులను అందిస్తోంది. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్‌ల ధర సాధారణంగా నెలకు రూ. 2,600 నుంచి రూ.3వేల వరకు ఉంటుంది.
అయితే, బేస్ ప్లాన్‌ల ధర మార్కెట్‌ను బట్టి రూ. 4వేల నుంచి రూ.6వేల మధ్య ఉంటుంది. ఆపరేటింగ్ లైసెన్స్ పొందినప్పటికీ, భారత్‌లో సర్వీసుల ప్రారంభానికి ముందు స్టార్‌లింక్ ఇంకా నియంత్రణ అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. ట్రాయ్ స్పెక్ట్రమ్ కేటాయింపు సిఫార్సులు ఇప్పటికీ DoT నుంచి ఆమోదం పొందాల్సి ఉంది.