X Services Outage : గంటకు పైగా స్తంభించిన ‘ఎక్స్’ ‘సేవలు.. మాయమైన పోస్టులు.. ఎట్టకేలకు అందుబాటులోకి..!

X Services Outage : ఎక్స్ (ట్విట్టర్) సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల కొద్ది ఎక్స్ సర్వీసులు నిలిచిపోయ్యాయి. ఎట్టకేలకు మళ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

X Restores Access After Thousands of Users Report App

X Services Outage : ప్రపంచ బిలియనీర్ ఎలన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ (X‌) సర్వీసులు మళ్లీ నిలిచిపోయాయి. ఎక్స్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల కొద్ది సర్వీసులు నిలిచిపోయాయి. ఎక్స్ యూజర్లు అకౌంట్లను యాక్సస్ అయ్యేందుకు ప్రయత్నించగా లాగిన్ సమస్యలు తలెత్తాయి. కొంతమందికి అకౌంట్లో పోస్టు చేసిన పోస్టులు ఒక్కసారిగా కనిపించకుండా మాయమైపోయాయి. కానీ, ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ మళ్లీ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Read Also : Xbox Series S : ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే Xbox Series S గేమింగ్ కన్సోల్‌.. రూ. 9వేలు ప్లాట్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

మాయమైన యూజర్ల పోస్టులు :
వేలాది మంది వినియోగదారులు గురువారం (డిసెంబర్ 21) సర్వీసును యాక్సెస్ చేయలేకపోయారని అనేకమంది ఫిర్యాదులు చేశారు. సుమారు ఉదయం 11 గంటలకు వినియోగదారులు సర్వీసులు అందుబాటులో లేదని పేర్కొనడానికి డౌన్‌టైమ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఇతర యూజర్లు ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌లను చూడలేరని రిపోర్టు చేశారు. ఎక్స్ వెబ్ ఇంటర్‌ఫేస్, మొబైల్ యాప్‌లను విజిట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి పోస్ట్‌లను వీక్షించలేకపోయారని నివేదించారు. ఎక్స్ పోస్టులు మాయం అవ్వడంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు.

X Restore Report App

గంట తర్వాత మళ్లీ అందుబాటులోకి :
అయితే, దాదాపు మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో ఎక్స్ పోస్ట్‌లు అన్ని ఫీడ్‌లలో కనిపిస్తున్నాయి. ఎక్స్ సర్వీసులు నిలిచిపోయాయని వినియోగదారులు నివేదించిన దాదాపు గంట తర్వాత అందుబాటులోకి వచ్చాయి. డౌన్‌టైమ్ ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌డెటెక్టర్‌కు యూజర్ల నుంచి 67వేల కన్నా ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అయితే వెబ్‌సైట్ భారతీయ వెర్షన్‌లో అదే ఫిర్యాదుతో 4,800 కన్నా ఎక్కువ నివేదికలు ఉన్నాయి. ట్విట్టర్ ఏపీఐ స్టేటస్ పేజీ “ఆల్ సిస్టమ్స్ ఆపరేషనల్” అని చూపిస్తుంది.

ఎక్స్ కొన్ని భాగాలు సైట్‌లో సాధారణంగా పని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూజర్లు ఉన్న ప్రాంతంలోనే ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను చూపే ట్రెండింగ్ టాపిక్స్ విభాగం వంటివి. అయితే, ఈ ట్రెండింగ్ టాపిక్‌లపై క్లిక్ చేయడం వలన పోస్ట్‌లు ఏవీ కనిపించడం లేదు. మీరు ఎక్స్ అకౌంట్లలో లాగిన్ చేసినప్పుడు లోడ్ అయ్యే ఫీడ్ ఖాళీగా కనిపిస్తుంది. లిస్టు సెక్షన్లను విజిట్ చేయడం ద్వారా వివిధ లిస్టుల పేర్లను కూడా ప్రదర్శిస్తుంది. కానీ, వాటిపై క్లిక్ చేస్తే పోస్ట్‌ల కోసం వెయిటింగ్ అని మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.

X Users Report

ఈ జాబితాలోని యూజర్ల నుంచి పోస్ట్‌లు ఇక్కడ కనిపిస్తున్నాయని అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతోంది. ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలన్ మస్క్‌తో సహా ఏ యూజర్ల నుంచి పోస్ట్‌లు కనిపించలేదు. మరోవైపు, స్పేసేస్ యధావిధిగా పని చేస్తూనే ఉంది. డైరెక్ట్ మెసేజ్‌లు కూడా కనిపిస్తాయి. ప్లాట్‌ఫారమ్‌లో సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తాయి. వినియోగదారుల పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్‌లు కూడా సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

Read Also : Apple : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమేనట!