Xiaomi 14 Civi Price : వారెవ్వా.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో భారీగా తగ్గిన షావోమీ 14 Civi ఫోన్.. ఈ డీల్ మీకోసమే!
Xiaomi 14 Civi Price : అమెజాన్‌లో కొత్త షావోమీ 14 సివి ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు..

Xiaomi 14 Civi Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో షావోమీ 14 సివి భారీ తగ్గింపుతో లభిస్తోంది. రూ. 18,200 కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ షావోమీ 14 సివి ప్రత్యేకమైన డిజైన్, ఆకట్టుకునే డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, మల్టీఫేస్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. షావోమీ 14 సివి ఆఫర్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

షావోమీ 14 సివి అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో షావోమీ 14 సివి మొదట రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.26,249కి అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఈ షావోమీ ఫోన్ రూ.16,750 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

అదనంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేదా కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే కొనుగోలుదారులు అదనంగా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. ధర మరింత తగ్గింపు కోసం తమ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : షావోమీ 14 సివి ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్, 68-బిలియన్ కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది.

మన్నిక విషయానికి వస్తే.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,700mAh బ్యాటరీతో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. షావోమీ 14 సివి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో PDAF, OISతో 50MP మెయిన్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ రెండు 32MP సెల్ఫీ కెమెరాలు కలిగి ఉంది.
