Xiaomi 14 Civi Price
Xiaomi 14 Civi Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ప్రైమ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. మీరు ప్రైమ్ సబ్‌స్క్రైబర్ అయితే షావోమీ 14 Civi ఫోన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో అనేక ప్రొడక్టులపై అద్భుతమైన డీల్స్, ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్ హోం అప్లియన్సెస్ నుంచి ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ మరిన్నింటిపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
మీరు కూడా ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన సమయం. ప్రస్తుతం టాప్ డీల్స్‌లో అమెజాన్ షావోమీ 14 సివిపై (Xiaomi 14 Civi Price) భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకమైన డిజైన్, ఆకట్టుకునే డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, మల్టీఫేస్ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. షావోమీ 14 సివి ఫోన్ తగ్గింపు ధరకే ఎలా కొనుగోలు చేయొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
షావోమీ 14 సివి అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో షావోమీ 14 సివి ఫోన్ రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ షావోమీ ఫోన్ రూ.24,999కి లభ్యమవుతుంది. లాంచ్ ధర కన్నా రూ.18వేలు తగ్గింపు పొందింది. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.
షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
షావోమీ 14 సివి ఫోన్ 6.55-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. HDR10+, డాల్బీ విజన్, 68-బిట్ కలర్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంకా, 3000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. షావోమీ 14 సివి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది. అలాగే, 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ పరంగా ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో PDAF, OISతో 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ షావోమీ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు 32MP కెమెరాలను కలిగి ఉంది.