Xiaomi : ఛార్జింగ్ సమస్యలా?.. పాత ఫోన్‌లపై కొత్త బ్యాటరీ ఆఫర్..!

Xiaomi phone : మీ ఫోన్ ఛార్జింగ్ సమస్యలా? అయితే పాత ఫోన్ పడేసి కొత్త ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసం

Xiaomi phone : మీ ఫోన్ ఛార్జింగ్ సమస్యలా? అయితే పాత ఫోన్ పడేసి కొత్త ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసం.. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ ఆఫర్ తీసుకొచ్చింది. అదే.. బ్యాటరీ రిప్లేస్ మెంట్ పొగ్రామ్.. దీని ద్వారా మీ పాత ఫోన్ లోని బ్యాటరీని వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు.. అంటే.. కొత్త బ్యాటరీని తీసుకోవచ్చు. బ్యాటరీ లేదా ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న యూజర్లకు రిలీఫ్ కలిగించేందుకు Xiaomi పాత ఫోన్‌లకు కొత్త బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు Mi సర్వీస్ సెంటర్‌లో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని చెక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకే బ్యాటరీని రీప్లేస్ చేసేందుకు కంపెనీ అనుమతిస్తుంది. కస్టమర్లు రూ.499 చెల్లించి ఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చని Xiaomi ట్విట్టర్‌లో ప్రకటించింది.

Redmi, Xiaomi స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీ డివైజ్ చాలా పాతది అయితే, మీరు తప్పనిసరిగా కొన్ని బ్యాటరీ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్యాటరీ డ్రెయిన్ సమస్య.. చాలా మంది యూజర్లు రోజువారీ జీవితంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఆ పాత ఫోన్ వాడలేక.. చివరికి కొత్త ఫోన్ కొనుగోలు చేస్తారు. ఇలాంటి యూజర్ల కోసం మీ పాత ఫోన్ బ్యాటరీని చెక్ చేసుకోవచ్చు. ఆపై కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేసుకోవచ్చు. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కోసం ప్రారంభ ధర రూ. 499వరకు ఉంటుంది. డివైజ్ బట్టి ధర మారవచ్చు.

Xiaomi Announces Battery Replacement Program For Old Phones

మీ ఫోన్ బ్యాటరీ మార్చేందుకు సంకేతాలివే :
మీ ఫోన్ బ్యాటరీ డ్రెయిన్‌ అధికంగా ఉందా? సాధారణ పరిస్థితుల్లోనూ మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డెడ్ అవుతుందని మీరు భావిస్తే.. వెంటనే ఆ బ్యాటరీ మార్చేసుకోవాలి. అదే మీకు సంకేతం.. బ్యాటరీ లైఫ్ ముగిసింది. కొత్త బ్యాటరీతో రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 10 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటే అకస్మాత్తుగా మీరు రోజుకు చాలాసార్లు ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నారా? ఇది కూడా సంకేతమే.. మీ స్మార్ట్‌ఫోన్ 100 శాతం ఛార్జ్‌ని చూపించి.. కొన్ని నిమిషాల తర్వాత, ఏ కారణం లేకుండానే 80-90 శాతానికి పడిపోతుందని మీరు గమనిస్తే.. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అయిపోందని సంకేతం. మీ ఫోన్‌లో బ్యాటరీ లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే యూజర్లు కంపెనీ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి డివైజ్ చెక్ చేసుకోవచ్చు.

Read Also : Xiaomi 12 Pro : షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్..!

ట్రెండింగ్ వార్తలు