కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ షావోమీ, శాంసంగ్‌ ఫ్లిప్‌ ఫోన్లలో ఏది బెటర్?

మీరు కొత్త ఫ్లిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు, మీ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోతుందో తెలుసుకోండి.

ఫ్లిప్ ఫోన్లు ఇప్పుడు మళ్లీ దుమ్ము రేపుతున్నాయి. ఖతర్నాక్ డిజైన్లతో, అత్యాధునిక ఫీచర్లతో 2025 మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది Samsung Galaxy Z Flip 6. ఇప్పుడు అద్భుతమైన స్పెసిఫికేషన్లతో Xiaomi Mix Flip 2 రాబోతుంది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయింది.

మీరు కొత్త ఫ్లిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు, మీ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోతుందో తెలుసుకోండి

పవర్, పర్ఫార్మెన్స్
Xiaomi Mix Flip 2: ఇందులో సరికొత్త Snapdragon 8 Elite చిప్ ఉంది. హై-ఎండ్ గేమింగ్, 4K వీడియో ఎడిటింగ్, ఒకేసారి పదుల కొద్దీ యాప్స్ వాడటం వంటివి చేసే యూజర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Samsung Galaxy Z Flip 6: ఇందులో శక్తిమంతమైన Snapdragon 8 Gen 3 ఉంది. ఇది రోజువారీ పనులను, గేమింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఇది వేగవంతమైనదే అయినప్పటికీ,  Xiaomi అంతటి ‘రా’ పవర్ ఇందులో లేదని విశ్లేషకులు అంటున్నారు. మీరు కేవలం సోషల్ మీడియా, వీడియోలు చూడడానికి ఫోన్‌ను వాడితే శాంసంగ్ సరిపోతుంది. కానీ, మీరు గేమ్స్‌ బాగా ఆడితేచ Xiaomi నచ్చుతుంది.

Also Read: అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌న్యూస్.. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్!

డిస్‌ప్లే, బ్యాటరీ

ఫీచర్ Xiaomi Mix Flip 2 Samsung Galaxy Z Flip 6
డిస్‌ప్లే 6.86″ LTPO AMOLED 6.7″ AMOLED
రక్షణ Gorilla Glass Victus
బ్యాటరీ 5165 mAh 4000 mAh
ఛార్జింగ్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ 25W

మీరు రోజంతా బయట ఉండి, ఫోన్‌ను విపరీతంగా వాడితే, పదేపదే ఛార్జింగ్ పెట్టే ఓపిక లేకపోతే, Xiaomi Mix Flip 2 బాగుంటుంది. డిస్‌ప్లే నాణ్యత, బ్యాటరీ లైఫ్ రెండింటిలోనూ శాంసంగ్‌ కన్నా Xiaomi Mix Flip 2 మెరుగ్గా ఉంది.

కెమెరా
ఫ్లిప్ ఫోన్ అయినా, కెమెరా క్వాలిటీలో రాజీ పడకూడదు.

Xiaomi Mix Flip 2లో Leica ట్యూన్డ్ 50MP + 50MP డ్యూయల్ కెమెరా ఉంది. Light Hunter 800 సెన్సార్ ఉంటుంది. తక్కువ వెలుతురులో (రాత్రిపూట) ఫొటోలను అద్భుతంగా తీస్తుంది. 32MP సెల్ఫీ కెమెరా, 4K @ 60fps వీడియో రికార్డింగ్ ఉంటుంది.

Samsung Galaxy Z Flip 6లో 50MP + 12MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. 10MP సెల్ఫీ కెమెరా, 4K @ 30fps వీడియో ఉంది.

సోషల్ మీడియాలో పోస్టులు చేయడానికి మంచి ఫొటోలు తీయాలంటే శాంసంగ్ సరిపోతుంది. కానీ, మీరు ఫొటోగ్రఫీని సీరియస్‌గా తీసుకుని, ప్రొఫెషనల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు కావాలనుకుంటే,  Xiaomi బాగుంటుంది.

ధర, ఆఫర్లు

Samsung Galaxy Z Flip 6: ఇటీవల ధర తగ్గి, ప్రస్తుతం రూ.67,999కు Amazonలో లభిస్తోంది. దీనిపై No-Cost EMI, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Xiaomi Mix Flip 2: భారత్‌లో త్వరలో లాంచ్ కానుంది. అంచనా ధర రూ.71,990. లాంచ్ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది, కానీ వేచి చూడాలి.