అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌న్యూస్.. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్!
ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

AnganWadi
అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్. అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ఠ వయసును 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. 45 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న మొత్తం అంగన్వాడీ హెల్పర్లు 4,322 మంది.
వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. టీచర్లుగా ప్రమోషన్ పొందాలనుకునే అంగన్వాడీ హెల్పర్ల గరిష్ఠ వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచే ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
Also Read: 670 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి.. మన సూర్యుడి దగ్గరకు వస్తున్న ఈ వింత వస్తువేంటి?
గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు, పోషణ, విద్యను అందించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. గర్భవతుల, తల్లిదండ్రుల కోసం వైద్య సలహాలు, పోషకాహార సమాచారం ఇస్తుంటారు. చిన్నారులలో మానసిక, భౌతిక అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుంటారు. మహిళలకు ఆరోగ్య, సాంఘిక అంశాలపై అవగాహన కల్పిస్తారు.