Xiaomi to expand HyperOS rollout to more devices
Xiaomi HyperOS : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) ఇటీవలే బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల కోసం సరికొత్త ఓఎస్ అప్‌డేట్ (HyperOS, MIUI)లను ప్రవేశపెట్టింది. షావోమీ 12, షావోమీ 12ఎస్, రెడ్‌మి కె50 సిరీస్‌లతో సహా మరిన్ని డివైజ్‌ల్లో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను క్రమంగా విస్తరిస్తోంది.
అన్ని షావోమీ డివైజ్‌లను ఒకే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లో ఏకీకృతం చేసేలా ఓఎస్ రూపొందించింది. హైపర్ఓఎస్ మొదట షావోమీ 14 సిరీస్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. క్రమంగా మరిన్ని డివైజ్‌లకు విస్తరిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. షావోమీ వచ్చే నెల నుంచి ఎంపికైన షావోమీ, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు హైపర్ఓఎస్‌ను అందుబాటులోకి తెస్తోంది.
Read Also : Best Affordable Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!
రాబోయే షావోమీ హైపర్ఓఎస్ అప్‌డేట్ ఎంపిక చేసిన షావోమీ, రెడ్‌మి డివైజ్‌లకు అందుబాటులో ఉంటుంది. అర్హత కలిగిన డివైజ్‌ల్లో షావోమీ 12ఎస్ సిరీస్, షావోమీ 12 సిరీస్, రెడ్‌మి కె50 సిరీస్, షావోమీ ప్యాడ్ 5 ప్రో నుంచి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో 11 డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
* షావోమీ 12ఎస్ అల్ట్రా
* షావోమీ 12ఎస్ ప్రో
* షావోమీ 12ఎస్
* షావోమీ 12ప్రో
* షావోమీ 12 ప్రో డైమెన్సిటీ ఎడిషన్
* షావోమీ 12
* షావోమీ ప్యాడ్ 5 ప్రో 12.4
* షావోమీ కె50 అల్ట్రా
* షావోమీ కె50 గేమింగ్ ఎడిషన్
* షావోమీ కె50 ప్రో
* షావోమీ కె50
రాబోయే షావోమీ హైపర్ఓఎస్ అప్‌డేట్ పొందే డివైజ్‌ల జాబితాలో షావోమీ ప్యాడ్ 6 లేదు. అదేవిధంగా, కొత్త షావోమీ ప్యాడ్ 5 మాత్రమే అర్హతను కలిగి ఉంది. అయితే, ఇటీవల లాంచ్ అయిన షావోమీ 13 సిరీస్‌కు కూడా రాకపోవచ్చు. ఆసక్తికరంగా, షావోమీ 12ఎస్ లైనప్ ప్రారంభంలో షావోమీ లైకాతో సహకరించిన మొదటి షావోమీ స్మార్ట్‌ఫోన్‌లలో లిస్టు అయింది.
షావోమీ హైపర్ఓఎస్ అనేది ప్రస్తుత (MIUI) సిస్టమ్ స్థానంలో షావోమీచే అభివృద్ధి చేసిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. మల్టీ డివైజ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి రూపొందించింది. హైపర్‌ఓఎస్ లో లెవల్ రీఫ్యాక్టరింగ్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ, ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్, ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీతో వచ్చింది.
Xiaomi HyperOS
హైపర్‌ఓఎస్ హ్యూమన్ సెంట్రిక్ ఓఎస్‌గా రూపొందించింది. మోడ్రాన్ డిజైన్ లాంగ్వేజీ, వినూత్న ఫీచర్లను కలిగి ఉంది. డివైజ్ ఎక్స్ఛేంజ్, డేటా, యాప్‌లకు రిమోట్ యాక్సెస్‌ని అనుమతిస్తుంది. స్పీచ్ జనరేషన్, ఇమేజ్ సెర్చ్, ఆర్ట్‌వర్క్ క్రియేషన్ కోసం ఏఐ కనెక్టివిటీని అందిస్తుంది. షావోమీ ప్రొడక్టుల్లో మరింత వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది.
హైపర్ఓఎస్ ఫీచర్లు :
షావోమీ ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా హైపర్ఓఎస్ రిలీజ్ చేసింది. ఈ ఓఎస్ పనితీరు, ఏఐ ఇంటిగ్రేషన్, క్రాస్-డివైస్ కనెక్టివిటీ, ప్రైవసీ, భద్రతలో అనేక అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. హైపర్‌ఓఎస్ టెక్స్ట్ జనరేషన్, డూడుల్-టు-ఇమేజ్ కన్వర్షన్, నేచురల్ లాంగ్వేజ్ ఇమేజ్ సెర్చ్, ఇమేజ్ టు టెక్స్ట్ ఎక్స్‌ట్రాక్షన్ వంటి అనేక రకాల AI-ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా.. హైపర్ఓఎస్ వివిధ షావోమీ డివైజ్‌లకు ఈజీగా కనెక్ట్ చేస్తుంది. వినియోగదారులు డివైజ్‌ల్లో విధులను కొనసాగించడానికి, ఇతర డివైజ్‌లలో కాల్‌లను స్వీకరించడానికి, స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరాను ల్యాప్‌టాప్‌ల కోసం వెబ్‌క్యామ్‌గా ఉపయోగించుకోవడానికి, మొబైల్ డేటాను షేర్ చేయడానికి అనుమతిస్తుంది. అదనంగా, హైపర్ఓఎస్ ఓపెన్ సోర్స్ భాగాలు, అధునాతన ఎన్‌క్రిప్షన్, గ్రాన్యులర్ అనుమతితో ప్రైవసీ, మరింత భద్రతను మెరుగుపరుస్తుంది. కొత్త యూఐ ఐఓఎస్-ప్రేరేపిత లాక్‌స్క్రీన్, కస్టమైజడ్ విడ్జెట్‌లు, డైనమిక్-ఐలాండ్ లాంటి నోటిఫికేషన్ సిస్టమ్, మెరుగైన సెట్టింగ్స్ మెనుని అందిస్తుంది.
Read Also : Best Camera Smartphones : ఈ నవంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే