Apple Vision Pro Discount : మీకు ఆపిల్ ఉద్యోగి తెలిస్తే.. విజన్ ప్రోని 25శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు..!

Apple Vision Pro Discount : ఆపిల్ తన ఉద్యోగుల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. 3,499 డాలర్ల రిటైల్ ధరపై కనీసం 25శాతం తగ్గింపుతో విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను అందిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

You Can Buy The Vision Pro With A 25% Discount If You Know An Apple Employee

Apple Vision Pro Discount : ఆపిల్ తమ ఉద్యోగుల కోసం విజన్ ప్రో వంటి డివైజ్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఆపిల్ ఉద్యోగులకు రిటైల్ ధర 3,499 డాలర్ల నుంచి కనీసం 25శాతం తగ్గింపుతో ఆపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను అందజేస్తోంది. అవును మీరు చదివింది నిజమే. ఆపిల్ ఉద్యోగులు హెడ్‌సెట్‌ను సుమారు 2,600 డాలర్లకు కొనుగోలు చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారీ తగ్గింపు అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఈ ఆపిల్ ప్రొడక్టు.. ఇప్పుడే ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు.

Read Also : Honda NX500 Bike Launch : కొత్త బైక్ కొంటున్నారా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా NX500 అడ్వెంచర్ బైక్.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?

500 డాలర్లు క్రెడిట్ డిస్కౌంట్ :
బ్లూమ్‌బెర్గ్ సైతం ఈ వార్తలను ధృవీకరించింది. ఉద్యోగులకు మెమో ద్వారా సమాచారం అందించింది. కంపెనీ ఉద్యోగులు ఆపిల్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మ్యాక్ డివైజ్ కొనుగోలు చేయడానికి 500 డాలర్లు క్రెడిట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అదనంగా, ఆపిల్ కొత్త హెడ్‌సెట్‌ను ఉపయోగించడానికి అర్హత పొందేందుకు (ZEISS) ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లు అవసరమయ్యే ఉద్యోగులకు రీయింబర్స్ చేయడంపై కంపెనీ పరిశీలిస్తోంది.

Apple Vision Pro Price Discount

ముందుస్తు ఆర్డర్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే? :
ఆపిల్ పనిచేస్తున్నవారు అయితే ఈజీగా పొందవచ్చు. లేదంటే.. మీరు ఆపిల్‌లో పనిచేసే వారిని అడిగి తెలుసుకోవచ్చు. మీకోసం విజన్ ప్రో హెడ్‌సెట్‌ను కొనుగోలు చేయమని వారిని మీరు అడగవచ్చు. తద్వారా, దాదాపు 1,000 డాలర్లు ఆదా చేసుకోవచ్చు. ఈ డివైజ్ కోసం 199 డాలర్ల క్యారీయింగ్ కేస్ వంటి అప్లియన్సెస్ కొనుగోలు చేయొచ్చు. ఆపిల్ విజన్ ప్రో కోసం ముందస్తు ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.

అందులో 256జీబీ మోడల్ 3,499 డాలర్లు, 512GB మోడల్ 3,699 డాలర్లు, 1TB భారీ మోడల్ 3,899 డాలర్లు ఉంటుంది. ఈ డివైజ్ ఫిబ్రవరి 2న అందుబాటులోకి వస్తుంది. అయితే, అధిక డిమాండ్, పరిమిత స్టాక్ కారణంగా చాలా మంది వినియోగదారులు తమ డెలివరీ తేదీలను మార్చికి మార్చుకోవాల్సి వచ్చింది. అందరికి పూర్తిగా అందుబాటులోకి రావాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే..

Read Also : Realme Note 50 Launch : ఈ నెల 23న రియల్‌మి నోట్ 50 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!