Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదంటూ మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? ఇదో పెద్ద స్కామ్.. ఆ లింక్ క్లిక్ చేయొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!

Electricity Bill Scam : ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు.. వినియోగదారులను మోసగించేందుకు కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ప్రతినెలా చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి నోటిఫికేషన్లపై కూడా మోసాలకు పాల్పడుతున్నారు.

Your electricity bill is due, supply will be disconnected_ This message is a big scam, don't click on it

Electricity Bill Scam : ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు.. వినియోగదారులను మోసగించేందుకు కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ప్రతినెలా చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి నోటిఫికేషన్లపై కూడా మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు స్పామ్ మెసేజ్‌లను పంపుతూ తప్పుదారి పట్టిస్తున్నారు. మీకు ఏదైనా మెసేజ్ ఇలా వచ్చిందా? అయితే తొందరపడి ఆ మెసేజ్ లింక్ క్లిక్ చేయకండి. లేదంటే మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు మోసగాళ్లు. ఇటీవల విద్యుత్ బిల్లు చెల్లించే గడువు తేదీకి సంబంధించి ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. అందులో మీరు విద్యుత్ బిల్లు చెల్లించలేదా? అత్యవసరంగా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆ మెసేజ్ సారాంశం..

వాస్తవానికి ఇలా ఎప్పుడు కూడా విద్యుత్ శాఖ ఫోన్లకు మెసేజ్ పంపదని గుర్తించుకోండి. ఇదో పెద్ద స్కామ్ అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరులో ఇప్పటికే సైబర్ మోసగాళ్ల స్కామ్‌లో చిక్కుకుని లక్షల్లో నష్టపోయారు. ఇటీవలి కేసులో అరవింద్ కుమార్ అనే 56 ఏళ్ల వ్యాపారవేత్త ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లు చెల్లింపుసాకుతో రూ.4.9 లక్షలు మోసం చేశారు. బాధితురాలు బెంగళూరులోని చామరాజపేట నివాసి, ఆన్‌లైన్ స్కామ్‌పై శనివారం వెస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాధితుడు.. బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) అధికారిగా నమ్మిస్తూ ఓ వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని నివేదికలో వెల్లడించాడు.

కరెంటు బిల్లు బకాయి ఉందని ఫోన్ చేసిన వ్యక్తి కుమార్‌కు తెలియజేశాడు. వెంటనే చెల్లించకపోతే, అప్పుడు విద్యుత్ సరఫరా డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించాడు. విద్యుత్ బిల్లును ఎలా చెల్లించాలి అని అడగడంతో ఆ ఫోన్ కాలర్ అతనికి టీమ్‌వ్యూయర్ క్విక్ సపోర్ట్ మొబైల్ యాప్‌ (Teamviewer Quick Support mobile App)ని డౌన్‌లోడ్ చేసుకోమని లింక్‌ను పంపాడు. కుమార్ సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన వెంటనే.. స్కామర్ అతని బ్యాంక్ అకౌంట్ వివరాలకు యాక్సెస్ పొందాడు. అంతే పెద్ద మొత్తంలో డబ్బును అతని అకౌంట్లో నుంచి కాజేశాడు. బాధితుడి అకౌంట్ నుంచి ఆ మోసగాడు అక్షరాలా రూ.4.9 లక్షలు ఎత్తుకెళ్లాడు.

Your electricity bill is due, supply will be disconnected

Read Also :  WhatsApp New Scam : వాట్సాప్‌లో కొత్త సైబర్ స్కామ్.. ఏకంగా రూ. 57 కోట్లు కోల్పోయిన యూజర్లు.. ఇలా చేస్తే.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండొచ్చు!

ట్రూకాలర్ లింక్‌‌తో స్మార్ట్‌ఫోన్‌లో రిమోట్ కంట్రోల్‌ యాక్సెస్ :
బాధితురాలి ఫిర్యాదుతో కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్‌కు ఎలా తెరతీశారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. బాధితుడు కాలర్ సూచనలను అనుసరించి ఆ యాప్‌ డౌన్‌లోడ్ చేశాడు. స్మార్ట్‌ఫోన్‌లు లేదా ఇతర డివైజ్‌లను రిమోట్‌గా కనెక్ట్ చేసేందుకు అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో టీమ్‌వ్యూయర్ క్విక్ సపోర్ట్ వంటి యాప్‌లతో స్కామర్లు ప్రజలను మోసగిస్తున్నారు. కుమార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి.. యాక్సెస్ వివరాలను షేర్ చేసినప్పుడు.. స్కామర్ స్మార్ట్‌ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ పొందాడు. అతను తన స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసిన బ్యాంకింగ్ వివరాలన్నింటినీ దొంగిలించాడు.

ఇలాంటి స్కామ్‌ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
విద్యుత్ బిల్లుకు సంబంధించి ఏదైనా మెసేజ్.. మీ ఫోన్‌కు SMS లేదా WhatsAppలో వచ్చినప్పుడు తొందరపడి క్లిక్ చేయొద్దు. ఆ మెసేజ్‌లో సంబంధిత ఆఫీసు కాంటాక్ట్ వివరాలను సంప్రదించాలంటూ ఒక లింక్ పంపుతారు. అందులో నంబర్ ద్వారా స్కామర్లు బాధితుల స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు ఫిషింగ్ లింక్‌ని ఉంచుతారు. మీ విద్యుత్ బిల్లుకు సంబంధించి SMS నిజమైనదా లేదా నకిలీదా అని చెక్ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

* మీ స్మార్ట్‌ఫోన్‌లో కరెంటు బిల్లుకు సంబంధించిన మెసేజ్ మీకు ఎక్కడ వచ్చిందో చెక్ చేయండి.
* అన్ని ప్రభుత్వ అధికారిక హెచ్చరికలు ఎల్లప్పుడూ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు పంపుతాయని గుర్తించాలి.
* మీరు మీ బిల్లును అత్యవసరంగా చెల్లించాలని ఎవరి నుంచి అయినా మీకు మెసేజ్ లేదా కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి.
* మోసగాళ్లు తరచుగా ఇలాంటి భయాందోళనలకు గురిచేస్తారు.
* తొందరపడి వారు చెప్పినట్టు చేస్తే వారి ట్రాప్ లో పడతారు జాగ్రత్త..
* మీకు వచ్చిన మెసేజ్ చాలా జాగ్రత్తగా చదవండి.
* మీరు మెసేజ్ స్వీకరించిన నంబర్‌ను చెక్ చేయండి.
* ఆ మెసేజ్‌లో అక్షర దోషాలు ఉన్నాయో లేదో చెక్ చేయండి.
* ఏదైనా లింక్ ఓపెన్ చేసే ముందు అది ఎక్కడి నుంచో వచ్చిందో ధృవీకరించండి.
* ఒకవేళ మీరు నిజంగా మీ విద్యుత్ బిల్లు చెల్లించారో లేదో చెక్ చేసుకోండి.
* నేరుగా విద్యుత్ బోర్డు లేదా సరఫరాదారుని సంప్రదించండి.
* మీ మునుపటి విద్యుత్ బిల్లులపై సంప్రదింపు వివరాలు అందుబాటులో ఉంటాయి.
* విద్యుత్ బిల్లులు కాకుండా, మోసగాళ్లు KYC అప్‌డేట్‌లు, హ్యాక్ చేసిన అకౌంట్లు, గ్యాస్ కనెక్షన్‌లు మొదలైన వాటికి సంబంధించిన మెసేజ్‌లను కూడా పంపుతారు.
* అధికారిక ప్రభుత్వ విభాగాలు ప్రజలను ఎప్పుడూ కూడా ఇలాంటి వివరాలను అడగవని గుర్తుంచుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?