YouTube : యూట్యూబ్‌లో బిగ్ అప్‌డేట్.. పించ్-టు-జూమ్ ఫీచర్.. మీరు వీడియోను జూమ్ చేసి చూడవచ్చు..!

YouTube : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ లో మేజర్ అప్‌డేట్ వచ్చింది. యూట్యూబ్ లో అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ రీడిజైన్ చేసింది. అలాగే వీడియోను కావాల్సిన విధంగా జూమ్ చేసుకునేలా వీలు కల్పించింది.

YouTube : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ లో మేజర్ అప్‌డేట్ వచ్చింది. యూట్యూబ్ లో అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ రీడిజైన్ చేసింది. అలాగే వీడియోను కావాల్సిన విధంగా జూమ్ చేసుకునేలా వీలు కల్పించింది. ఇందుకోసం YouTube ప్రధాన అప్‌డేట్ రిలీజ్ చేసింది. యాప్ ఇంటర్‌ఫేస్‌ను మార్చేసింది. కొన్ని కొత్త మార్పులను కూడా తీసుకువస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పించ్-టు-జూమ్ ఫీచర్ (pinch-to-zoom feature), యాంబియంట్ మోడ్, Precise seeking వంటి మరిన్నింటిని కూడా అందిస్తుంది. రాబోయే రోజుల్లో YouTube ప్రధాన ఫీచర్‌గా పనిచేస్తుంది. ఈ వీడియో YouTube లింక్‌లు బటన్‌లకు మారుతాయి. లైక్, షేర్ డౌన్‌లోడ్ వంటి యాక్షన్లను కూడా కింది వైపుకు మార్చేసింది.

క్రియేటర్‌లకు మంచి విషయం ఏమిటంటే.. కంపెనీ సబ్‌స్క్రైబ్ బటన్‌ను ఎక్కువ హైలైట్ చేసింది. తద్వారా ఎక్కువ ప్రాయారిటీని ఇచ్చింది. యూజర్లు ఇప్పుడు ఓవల్ ఆకారంలో ఉన్న వైట్ బాక్సులో క్రియేటర్ పేరుకు సమీపంలో సబ్‌స్క్రైబ్ బటన్‌ను చూడవచ్చు. అప్‌డేట్ యాంబియంట్ మోడ్‌ను కూడా యాడ్ చేసింది. వీడియోకి కిందిభాగంలో సబ్టెల్ ఎఫెక్ట్ యాడ్ చేస్తోంది. ఈ ఫీచర్ డార్క్ థీమ్‌లో వెబ్, మొబైల్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ డార్క్ థీమ్‌ను కూడా అందిస్తుంది. స్క్రీన్‌పై రంగులు ఎక్కువగా కనిపించేలా డార్క్ షేడ్‌ని అందించనుంది. వెబ్, మొబైల్, స్మార్ట్ టీవీలలో అందుబాటులోకి వస్తుంది.

YouTube gets a redesign, pinch to zoom, and other major updates

YouTube చివరకు pinch-to-zoom ఫీచర్‌ను యాడ్ చేసింది. జూమ్ చేసేందుకు పించ్‌తో మీరు ఇప్పుడు మీ iOS లేదా Android ఫోన్‌లో ఉన్నప్పుడు వీడియోని జూమ్ ఇన్, అవుట్ చేయవచ్చు. మీరు వీడియో జూమ్ అవుతుంది. ఈ ఫీచర్ గురించి ఎక్కువ వివరాలను అందించలేదు. వీడియోలో అధిక రిజల్యూషన్‌కు సపోర్టు ఉంటే మాత్రమే యూజర్లు జూమ్ చేయడానికి వీలువుతుంది. YouTube కొత్త Precise seeking ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. వీడియోలోని ప్రతి భాగాన్ని సులభంగా ట్రేస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

మీరు డెస్క్‌టాప్‌లో ఉన్నా లేదా మీ మొబైల్ డివైజ్‌లో ఉన్నా, వీడియో ప్లేయర్‌లో థంబునైల్ ప్రదర్శించాలని కోరుతూ పైకి లాగండి లేదా స్వైప్ చేయండి. ప్రతి వీడియోలోని కచ్చితమైన భాగాన్ని మీకు నచ్చిన విధంగా ఎడ్జెట్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసేందుకు ప్లేయర్‌పై ఎక్కడైనా ప్రెస్ చేసేందుకు వినియోగించవచ్చు. అప్పుడు మీరు వీడియోపై రెండు వేళ్లతో రెండుసార్లు నొక్కి పట్టుకోండి. ఈ వీడియోలో తరచుగా రీప్లే చేసిన వాటిని చూపించే గ్రాఫ్‌ను కూడా చూడవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Chrome : మీరు విండోస్ 7 వాడుతున్నారా? గూగుల్ క్రోమ్, విండోస్ 7 అప్‌డేట్ నిలిచిపోనుంది.. ఎప్పటినుంచంటే?

ట్రెండింగ్ వార్తలు