Zomato Food Order : జొమాటోలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒకేసారి అనేక రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు..!

Zomato Food Order : జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్‌డేట్‌ ద్వారా వినియోగదారులు ఇప్పుడు వివిధ రెస్టారెంట్‌ల నుంచి గరిష్టంగా 4 ఆర్డర్లను చేయొచ్చు.

Zomato now allows users to order food from multiple restaurants at the same time

Zomato Food Order : జొమాటో యూజర్లు అదిరే వార్త.. జొమాటో యాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. జొమాటోలో వివిధ రకాల ఆహారాన్ని సులభంగా ఆర్డర్ చేయొచ్చు. జొమాటో ఫుడ్యాప్ ఈ కొత్త ఫీచర్‌ ద్వారా వినియోగదారులు ఒకే సమయంలో మల్టీ రెస్టారెంట్‌ల నుంచి ఫుడ్ ఆర్డర్‌లను చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఫుడ్ డెలివరీ మందగించిన సమయంలో కంపెనీ పెద్ద మార్కెట్ వాటాను పొందాలనే లక్ష్యంతో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. జొమాటో ఫుడ్ డెలివరీ కొత్త ఫీచర్ అనేది.. ఇప్పటికే పోన్‌పే (PhonePe) యాజమాన్యంలోని యాప్ పిన్‌కోడ్ (Pincode) మాదిరిగా ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో వివిధ కేటగిరీలలో కార్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. జొమాటో యాప్‌ లేటెస్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు వివిధ రెస్టారెంట్‌ల నుంచి 4 కార్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా ఇష్టమైన ఫుడ్ ఆర్డర్‌లను ఒకే సమయంలో ఆర్డర్ చేయొచ్చు. ఒక కార్ట్ నుంచి ఆర్డర్‌ని పూర్తి చేసిన తర్వాత.. వినియోగదారులు మిగిలిన కార్ట్‌ల నుంచి ఆర్డర్ చేయడం కొనసాగించవచ్చు.

Read Also : Itel A60s Smartphone : రూ. 7వేల లోపు ధరలో ఐటెల్ A60s ఫస్ట్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్‌వర్క్ (ONDC) పిన్‌కోడ్ మాదిరిగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. పోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ పిన్‌కోడ్ లాంచ్ సందర్భంగా మల్టీ-కార్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. జొమాటో ఈ ఫీచర్ ద్వారా మరిన్ని ఆర్డర్లను పెంచుకోవాలని భావిస్తోంది. పోటీదారుల నుంచి మరింత మార్కెట్ వాటాను పొందే అవకాశం ఉంది.

Zomato now allows users to order food from multiple restaurants at the same time

జొమాటో, స్విగ్గి, ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో దాదాపు 5 బిలియన్ డాలర్ల విలువైన తమ మార్కెట్ షేర్లను విస్తరించుకోనున్నాయి. ప్రస్తుతం, జొమాటో 55 శాతం పెద్ద వాటాను కలిగి ఉండగా.. Swiggy వాటా 45శాతం వద్ద ఉంది. ఏది ఏమైనప్పటికీ.. 2020 నుంచి 52 శాతం మార్కెట్ వాటాతో స్విగ్గీ అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే, గత మూడు ఏళ్లుగా స్విగ్గీ మార్కెట్ వాటా క్రమంగా క్షీణిస్తోంది.

2023 ఆర్థిక సంవత్సరంలో Swiggy ఆదాయం 600 మిలియన్ డాలర్ల నుంచి సుమారు 900 మిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ, జొమాటోతో పోలిస్తే భారీ నష్టాలను చవిచూసింది. స్విగ్గీ నష్టాలు దాదాపు 545 మిలియన్ డాలర్లు.. అదే సమయంలో Zomato నష్టాలు సుమారు 110 మిలియన్ డాలర్లుగా నమోదైంది. జొమాటో కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకు షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇంతలో, స్విగ్గీ ఆదాయ వృద్ధి ఉన్నప్పటికీ మార్కెట్ వాటా క్షీణించింది.

Read Also : Upcoming Smartphones in July : కొత్త ఫోన్ కొంటున్నారా? జూలైలో రాబోయే సరికొత్త 5G ఫోన్లు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!