తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టకున్నారు.
సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ తొమ్మిది మందికి రేవంత్ రెడ్డి నగదు పురస్కారం అందించారు. ఎక్కా యాదగిరి రావు, అందె శ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరికి నగదు పురస్కారాన్ని ఇచ్చారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి నగదు పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు.
అలాగే, విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరఫున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు. మరోవైపు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ ,11 మంది కి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం అందించారు. బహు బాషా సాహితీ వేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.