మహిళా సంఘాల కోసం కొత్త స్కీమ్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రకటించిన సీఎం రేవంత్.. ఈ స్కీమ్ లాభాలివే..
సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించింది.

తెలంగాణ వచ్చాక పదేళ్ల తర్వాత కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను తాము చక్కదిద్దుతున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలని తెలిపారు. మహిళా సంఘాలకు క్యూఆర్ కోడ్ కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకువస్తామని అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. సివిల్స్‌కి ఎంపికైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకు రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేశామని అన్నారు.