Telangana Government
Minorities : రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సబ్సిడీతో మైనార్టీలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించనుంది.
దళితబంధు తరహాలోనే మైనార్టీల ఆర్థిక స్వాలంబనకు కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీల్లో అత్యధికంగా వెనుకబడిన వర్గాలే ఉంటాయి. దాంతో వారి ఆర్ధిక స్వాలంబన దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
నిన్ననే దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మైనార్టీలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణలో దాదాపు 40లక్షల మందికిపైగా పెన్షన్ దారులు ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది.
Also Read..Pension Hike : భారీగా పెన్షన్ పెంపు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, జీవో జారీ