జూన్‌లోనే remdesivir.. 10 లక్షల డోసులతో రెడీ!

కరోనా వైరస్ నివారణకు వాడుతున్న డ్రగ్ remdesivir సరఫరాకు సంబంధించి 10 లక్షల డోసులను అందించేందుకు రెడీగా ఉన్నామని ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్
ఎండీ బి.వంశీకృష్ణ తెలిపారు. తొలి దశలో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే లక్షల డోసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ డ్రగ్ తయారు చేసి, విక్రయించేందుకు అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో హెటిరో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
భారతదేశంలో remdesivir మెడిసిన్‌కు ఎంత స్థాయిలో డిమాండ్ ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాతే తెలిసే
అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే 10 లక్షల డోసులు అందించేందుకు రెడీగా ఉన్నామని వంశీకృష్ణ తెలిపారు. లైసెన్సీలతో మాట్లాడిన అనంతరం రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా remdesivir డ్రగ్ వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా తెలియదన్నారు. ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం, ఐసీఎంఆర్, డీసీజీఐ వినియోగం తెలుస్తుందన్నారు.
డీసీజీఐకి తదుపరి రెండు వారాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నట్టు వంశీకృష్ణ చెప్పారు. అత్యవసరమైన అంశం డీసీజీఐ కూడా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయొచ్చని ఆశిస్తున్నాం. 7–10 పనిదినాల్లో అందుబాటులోకి తేస్తామన్నారు. జూన్‌లోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ధర విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని వంశీకృష్ణ తెలిపారు. సాధారణంగా ధరను నిర్ణయించుకునేందుకు తయారీ సంస్థలకు అధికారం ఉందన్నారు.
రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసే ఈ ఔషధం పూర్తిగా మేకిన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉంటుందని తెలిపారు. remdesivirను విశాఖ, హైదరాబాద్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామని, ఇండియా ప్రొడక్టుగా చెప్పవచ్చునని అన్నారు. ఆఫ్రికా, ఆసియా మొదలైన ఖండాల్లో మధ్య, తక్కువ స్థాయి ఆదాయాలుండే సుమారు 127 దేశాలకు remdesivirను ఎగుమతి చేయొచ్చని వంశీకృష్ణ చెప్పారు.
Read Here>> endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు