Bathukamma
తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ రాష్ట్రం అంతా ఘనంగా జరుపుకుంటుంది. మహిళలు, బాలికలు రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో గౌరమ్మను ఆరాధిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ అంతటా బతుకమ్మ పండగని మహిళలు అంతా చేరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బతుకమ్మ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచడానికి, తెలంగాణ సంస్కృతిని డిజిటల్ మాధ్యమాల్లోకి తీసుకెళ్లడానికి 10టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
“సెల్ఫీ విత్ సద్దుల బతుకమ్మ” పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అనేక మంది మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేకమంది మహిళలు, బాలికలు తమ సద్దుల బతుకమ్మతో దిగిన ఫోటోలను, సెల్ఫీలను 10 టీవీకి పంపించారు. కొన్ని వందల మంది ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నారు.
Also See : సద్దుల బతుకమ్మ సంబరాలు.. 10టీవీ ‘సెల్ఫీ’ ఛాలెంజ్‌కు అద్భుత స్పందన.. బతుకమ్మ సెల్ఫీలు ఇవే
తాజాగా 10 టీవీ సెల్ఫీ విత్ సద్దుల బతుకమ్మ విజేతలను ప్రకటించింది. ఈ కాంటెస్ట్ ని ది చెన్నై సిల్క్స్ వాళ్ళు స్పాన్సర్ చేసారు. విజేతలకు స్పెషల్ గిఫ్ట్స్ కూపన్స్ ఇవ్వనున్నారు. 10 టీవీ సెల్ఫీ విత్ సద్దుల బతుకమ్మ విజేతల వివరాలను ఈ వీడియోలో చూసేయండి..