సద్దుల బతుకమ్మ సంబరాలు.. 10టీవీ ‘సెల్ఫీ’ ఛాలెంజ్‌కు అద్భుత స్పందన.. బతుకమ్మ సెల్ఫీలు ఇవే
తెలంగాణ సాంప్రదాయ పండుగలలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి వేడుకలు గ్రామ గ్రామాన, నగర నగరాన అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరిగాయి. మహిళలు, బాలికలు రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో గౌరమ్మను ఆరాధిస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచడానికి, తెలంగాణ సంస్కృతిని డిజిటల్ మాధ్యమాల్లోకి తీసుకెళ్లడానికి 10టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. "సెల్ఫీ విత్ సద్దుల బతుకమ్మ" పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక అవకాశం ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అనేక మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. తమ బతుకమ్మతో కలిసి తీసుకున్న అందమైన సెల్ఫీలను పంపారు. మహిళలు, బాలికలు, యువతులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ, పూల పండుగ ఆనందాన్ని తమ ఫోటోల ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోలు తెలంగాణ బతుకమ్మ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. 'బతుకమ్మ సెల్ఫీలు' ఇక్కడ చూడండి!

















































