10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు.

10th class exams : తెలంగాణలో ఇవాళ్టి నుంచి టెన్త్‌ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్‌ బోర్డ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు 8.30 గంటల వరకు చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. పేపర్‌ లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వకుండా పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు. అయితే పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఏంఈవో ఫోన్ నెంబర్లను డిస్‌ప్లే చేయనున్నారు.

AP TenthClass Exams Schedule : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల

పరీక్షలు జరుగుతున్న సమయంలో కరెంట్‌ సప్లైకు అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్‌.. ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు