AP TenthClass Exams Schedule : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.(AP TenthClass Exams Schedule)

AP TenthClass Exams Schedule : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల

Ap Tenthclass Exams Schedule (1)

Updated On : March 18, 2022 / 11:53 PM IST

AP TenthClass Exams Schedule : ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖ కొత్త పరీక్షా తేదీలను వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.(AP TenthClass Exams Schedule)

Half-Day Schools : ఏపీలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు

ఇంటర్ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.(AP TenthClass Exams Schedule)

 

కొత్త పరీక్షల షెడ్యూల్‌…

ఏప్రిల్‌ 27న తెలుగు

ఏప్రిల్‌ 28న సెకండ్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్‌ 29న ఇంగ్లీష్‌

మే 2న గణితం

మే 4న సైన్స్‌ పేపర్‌-1

మే 5న సైన్స్‌ పేపర్‌-2

మే 6న సాంఘిక శాస్త్రం(AP TenthClass Exams Schedule)

10th Class Exams : తెలంగాణలో మే 23 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ లో కూడా మార్పు చేశారు. మారిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి. మే 7 నుంచి మే 24వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరుగతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ రీ షెడ్యూల్ కారణంగా పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయని ఇంటర్ బోర్డు తెలిపింది.(AP TenthClass Exams Schedule)

ఒకేసారి ఇంటర్‌, పది పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాలు, ఇతరాత్ర సమస్యలు ఏర్పడతాయని అధికారులు గుర్తించారు. కాగా, పదో తరగతి విద్యార్థులకు ఏడు పరీక్షలే నిర్వహిస్తున్నందున పరీక్ష, పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజులు విరామం ఇచ్చారు.

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు చూసినా.. జేఈఈ పరీక్షల కారణంగా వాయిదా వేసింది.

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్..

మే 6 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

మే 9 ఇంగ్లీష్ పేపర్-1

మే 11 మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1

మే 13 మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మే 16 ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1

మే 18 కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1

మే 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)

మే 23వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1(AP TenthClass Exams Schedule)

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్..

* మే 7వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II

* మే 10వ తేదీ ఇంగ్లీష్ పేపర్-II

* మే 12వ తేదీ మ్యాథ్స్ పేపర్-II-A

* మే 14న తేదీ మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II

* మే 17వ తేదీ ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II

* మే 19వ తేదీ కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II , సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II

* మే 21వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II (బైపీసీ విద్యార్థులకు)

* మే 24వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II