Telangana Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం.. ఒక్కరోజే 12 కేసులు నమోదు
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్.
- Naveen
- Published On : January 1, 2022 / 08:57 PM IST
Telangana Corona Cases
Telangana Omicron Cases : యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. వీరిలో 27మంది కోలుకున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో 232 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 733 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ 28వేల 886 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్ లక్షణం కావొచ్చు..!
