New Police Stations : హైదరాబాద్ లో 13 కొత్త పోలీస్ స్టేషన్లు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. అలాగే కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

police stations
New Police Stations : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్బన్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలీచౌకీ, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిలింనగర్, రెహమత్ నగర్, బోరబండలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆరు జోన్లలో జోన్ కు ఒకటి చొప్పున మహిళ పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
మారేడుపల్లి, బోయిన్ పల్లి, జూబ్లిహిల్స్, ఎస్ఆర్ నగర్, అంబర్ పేట్, నల్లకుంట, నారాయణగూడ, చిలకలగూడ, బర్కతపుర, సంతోష్ నగర్, చంద్రాయన్ గుట్ట, టోలీచౌకీ, లంగర్ హౌస్ లలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కొత్త పోలీస్ స్టేషన్లకు ఇన్ స్పెక్టర్లను, సిబ్బందిని నియమించనున్నారు.