తెలంగాణలో కొత్తగా 1473 కరోనా పాజిటివ్ కేసులు

  • Publish Date - July 27, 2020 / 10:37 PM IST

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 1473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 55,532కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 471గా ఉంది. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు 12,955 ఉండగా 42,106 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి 774 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.85 శాతంగా ఉంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. 24 గంటల్లో జీహెచ్ఎంసీలో 506 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, వరంగల్ అర్బన్-111, సంగారెడ్డి జిల్లాలో 98, కరీంనగర్ జిల్లాలో 91 మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 86 కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-10, జగిత్యాల-18, జనగామ-10, జయశంకర్ భూపాపల్లి-10, జోగుళాంబ గద్వాల-32, కామారెడ్డి-17, ఖమ్మం-20, మహబూబ్ నగర్-8, మహబూబాబాద్-34, మంచిర్యాల-14, మెదక్-17, ములుగు-12, నాగర్ కర్నూలు-19, నల్లగొండ-28 మంది కరోనా బారిన పడ్డారు.

నారాయణపేట్-2, నిజామాబాద్-41, రాజన్న సిరిసిల్ల-19, సిద్ధిపేట్-12, సూర్యాపేట్-32, వికారాబాద్-2, వనపర్తి-9, వరంగల్ రూరల్-8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.