Baby Girl For Sale
15 days baby girl for sale ; పుట్టిన పట్టుమని 15రోజులు కూడా అమ్మ ఒడిలో హాయిగా ఆదమరిచి పడుకోనేలేదు. అమ్మ అంటే అక్కున చేర్చుకుని పాలు ఇచ్చి మమకారాన్ని చూపిస్తుంనుకుని హాయిగా నిద్రపోయే 15 రోజుల ఆడపసిగుడ్డుని ఏదో కూరగాయలు అమ్మినట్లుగా అమ్మేసింది తల్లి. కన్న తల్లిదండ్రునే ఆడబిడ్డను అంగటి సరుకుగా అమ్మేశారు. ఆడబిడ్డగా పుట్టటమే నా శాపమా? అమ్మా అని నోరు తెరిచి అడగలేని ఆ పసిగుడ్డు అంగటి సరుకుగా మారిపోయింది. నవమాసాలు మోసి కన్న తల్లే అమ్మేస్తే ఇక ఆబిడ్డకు దిక్కెవ్వరు? ఆ పసిబిడ్డ భవిష్యత్తు ఏమి కానుందో ఎవరికి తెలుసు?
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో 15 రోజులు ఆడపసిగుడ్డును రూ.80వేలకు అమ్మేశారు తల్లిదండ్రులు. మూడో సారి కూడా ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు 15 రోజుల శిశువును 80 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శిశువు తల్లిదండ్రులు దుర్గా ప్రియ, శ్రీనివాస్ పసిపాపను అమ్మేశారు.
జనవరి 21న దుర్గాప్రియ ఆడపిల్లకు జన్మనిచ్చింది. మనుమరాలిని చూద్దామని వచ్చిన అమ్మమ్మకు బిడ్డను అమ్మేశారనే విషయం తెలిసింది. ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కన్నబిడ్డను అమ్మేయటానికి మనస్సెలా ఒప్పిందే? కన్నదానివా? కసాయిదానివా? పెంచలేకపోతే బిడ్డను ఎందుకు కన్నారు? అని ఆగ్రహంగా ప్రశ్నించింది. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియటంతో కన్నవారితో పాటు వారికి సహకరించినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఆశా వర్కర్ బాషమ్మ సహాయంతో బాలానగర్‌కు చెందిన కవిత అనే మహిళకు పసిబిడ్డను అమ్మేసామని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. అయితే పిల్లలు లేని తన చెల్లికి అక్క కవిత పాపను కొనుక్కున్నామని నుగోలు చేసి ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. బిడ్డను స్వాధీనం చేసుకున్న పోలీసులు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు. చిన్నారిని అప్పగించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు వనస్థలిపురం పోలీసులు.