తెలంగాణలో కొత్తగా 1,921 కరోనా కేసులు

  • Publish Date - August 14, 2020 / 09:57 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్క రోజే రాష్ట్రంలో 1,921 మంది కరోనా బారినపడడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ బాధితులుగా మారినవారి సంఖ్య 88,396కు పెరిగింది.

ఇక నిన్న(13 ఆగస్ట్ 2020) ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 9 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 674కు చేరుకుంది. కొత్తగా 1,210 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,284కు పెరిగింది. రాష్ట్రంలో 23,438 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 16,439 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కేసుల విషయానికి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో 356, మేడ్చల్‌ 168, రంగారెడ్డి 134 కరోనా కేసులు నమోదయ్యాయి.