Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ఓ కారు వేగంగా వచ్చి, అదుపుతప్పి.. నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది.

Accident

తెలంగాణలోని పెద్దపల్లి పట్టణశివారులోని రంగంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఓ కారు వేగంగా వచ్చి, అదుపుతప్పి.. నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ పెద్దపల్లిలోని ఉదయనగర్‌కు చెందిన అమృత, భాగ్య అని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Pawan Kalyan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్