Hyderabad Road Accident : ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన జీహెచ్ఎంసీ లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

లాలపేట్ నుండి మౌలాలి వైపు ఫ్లై ఓవర్ మీదుగా జీహెచ్ఎంసీ లారీ స్పీడ్ గా వెళుతోంది. లారీ బలంగా ఢీకొట్టడంతో డివైడర్, కరెంట్ పోల్, సీసీ కెమెరా స్టాండ్ ధ్వంసం అయ్యాయి.

Road Accident (9)

GHMC lorry collided Two-Wheelers : హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ లారీ బీభత్సం సృష్టించింది. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మౌలాలి ఫ్లై ఓవర్ సమీపంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గేట్ వైపు మార్గంలో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న జీహెచ్ఎంసీ లారీ ఎదురుగా వస్తున్న పలు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టింది.

దీంతో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. జీహెచ్ఎంసీ లారీ బలంగా ఢీకొట్టడంతో డివైడర్, కరెంట్ పోల్, సీసీ కెమెరా స్టాండ్ ధ్వంసం అయ్యాయి. లాలాపేట్ నుండి మౌలాలి వైపు ఫ్లై ఓవర్ మీదుగా జీహెచ్ఎంసీ లారీ స్పీడ్ గా వెళుతోంది.

Minister KTR : ప్రధానికి మంత్రి కేటీఆర్ 10 ప్రశ్నలు.. సమాధానం చెప్పాకే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి

జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ ఫ్లై ఓవర్ నుండి అపోసిట్ మార్గం వైపు నడిపారు. ఈ ప్రమాదం లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్ల జరిగిందా లేదా స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. మౌలాలి ఫ్లై ఓవర్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.