కేజీబీవీలో 26 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

ప్రస్తుతం నలుగురు విద్యార్థినుల పరిస్థితి మాత్రం బాగోలేదని వైద్యులు చెప్పారు.

కేజీబీవీలో 26 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

KGBV School

వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నస్కల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. వారంతా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు వైద్యులు చెప్పారు.

బాలికల్లో రక్తహీనత నిర్మూలనలో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సాయంత్రం స్నాక్స్‌లో శనగలు ఇచ్చారు. మొదట నలుగురు బాలికలు అస్వస్థతకు గురి కావడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరుసగా 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం నలుగురు విద్యార్థినుల పరిస్థితి మాత్రం బాగోలేదని వైద్యులు చెప్పారు. ఆ నలుగురు బాలికలకు ఆస్తమా ఉండడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుున్నారు. ఈ విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలికల పరిస్థితిపై కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యులతో మాట్లాడారు.

Also Read: టీ పెట్టే విషయంలో గొడవ.. కోడలిని చంపిన అత్త