టీ పెట్టే విషయంలో గొడవ.. కోడలిని చంపిన అత్త

కోడలిపై మొదట దాడి చేసిన అత్త.. ఆ తర్వాత చున్నీతో గొంతు..

టీ పెట్టే విషయంలో గొడవ.. కోడలిని చంపిన అత్త

representative image

Attapur Case: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. టీ పెట్టే విషయంలో గొడవ చెలరేగి కోడలిని చంపింది అత్త. సంగారెడ్డికి చెందిన పర్వీనా బేగానికి పదేళ్ల క్రితం ఆటో డ్రైవర్ అబ్బాస్‌తో పెళ్లి జరిగింది. వీరి దాంపత్యానికి చిహ్నంగా ఇద్దరు కుమారులు అన్నారు. వారింట్లో కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయి.

తాజాగా టీ పెట్టే విషయంలో ఆగ్రహానికి గురైన అత్త అజ్మీరా చున్నీతో కోడలి గొంతును బిగించి హత్య చేసింది. హసన్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడలిపై మొదట దాడి చేసిన అత్త.. ఆ తర్వాత చున్నీతో గొంతు బిగించి చంపినట్లు తెలుస్తోంది. ఘటన స్థలికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన వెనుక వరకట్న వేధింపుల అంశం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట అజ్మీరా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కోడలు ఉలుకు పలుకు లేకుండా పడి పోయిందని నాటకం ఆడింది. తమ ఇద్దరి మద్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి ఆమె లేవడం లేదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కోడలిది హత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు చున్నీని స్వాధీనం చేసుకుని, అత్తను అరెస్టు చేశారు.

Also Read: గుంతలో పడిన చిరుత.. అటవీ అధికారులు ఏం చేశారంటే?