గుంతలో పడిన చిరుత.. అటవీ అధికారులు ఏం చేశారంటే?

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం వద్ద గుంతలో పడిన చిరుత పులిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గుంతలో పడిన చిరుత.. అటవీ అధికారులు ఏం చేశారంటే?

Operation Cheetah

Updated On : June 27, 2024 / 3:07 PM IST

Operation Cheetah in Prakasam District : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం వద్ద గుంతలో పడిన చిరుత పులిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత పడిన గుంత 8 నుంచి 10 అడుగు లోతు ఉంది. గిద్దలూరు ఫారెస్ట్ రెంజిమెంట్ అధికారుల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి దేవనగరంకు వచ్చిన చిరుతపులి ప్రమాదవ శాత్తూ గుంతలో పడిపోయింది. అటువైపు పశువులకు మేతకు తోలుకెళ్లిన రైతులు చిరుత పులి గుంతలో పడినట్లు గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియచేశారు.

Also Read : మేము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చు.. కానీ..: హోంమంత్రి అనిత

చిరుత గుంతలో పడిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. మార్కాపురం, గిద్దలూరు అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. చిరుత గుంతలో పడి దాదాపు 17గంటలు కావడంతో దానికి నీరు ఆహారంను అటవీ అధికారులు అందిస్తున్నారు. వలలు, బోను సహాయంతో చిరుతను రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు.