నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో 28 మంది ఎలిమినేట్‌

నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 28 మంది అభ్యర్థులు ఎలిమినేట్‌ అయ్యారు.

28 candidates eliminated in MLC votes counting : నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 28 మంది అభ్యర్థులు ఎలిమినేట్‌ అయ్యారు. తొలి రౌండ్‌ పూర్తయ్యాక తక్కువ ఓట్లు సాధించిన 28 మంది అభ్యర్థులను అధికారులు పోటీ నుంచి ఎలిమినేట్‌ చేశారు. ఎలిమినేటైన వారి రెండో ప్రాధాన్యత ఓట్లను ముగ్గురు అభ్యర్ధులకు కలిపారు. మొత్తం 270 ఓట్లను ముగ్గురు అభ్యర్ధులకు కలిపారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లారాజేశ్వర్ రెడ్డికి 89 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 94 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 87 ఓట్లు కలిపారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 70మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో 28 మందిని పోటీ నుంచి తప్పించారు.

ఈ ఉదయం నుంచి రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లక్షా 83 వేల 167 ఓట్లు గెలుపు కోటాగా నిర్ణయించారు అధికారులు. మొదటి ప్రాధాన్యతలో 3 లక్షల 66 వేల 333 ఓట్లు చెల్లగా.. 21 వేల 636 ఓట్లు చెల్లకుండా పోయాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లక్షా 10 వేల 840 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 83 వేల 290 ఓట్లు.. కోదండరామ్‌కు 70 వేల 72 ఫస్ట్‌ ప్రియారిటీ ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39 వేల 107 ఓట్లు పడ్డాయి.

సమీప అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 27 వేల 500 ఆధిక్యంలో ఉన్నారు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకంగా మారాయి. రెండో ప్రాధాన్యతా ఓట్లలో పల్లా గెలవాలంటే 20శాతంపైగా ఓట్లు సాధించాల్సి ఉంది. తీన్మార్ మల్లన్న 28శాతం పైగా రెండో ప్రాధాన్యతా ఓట్లు సాధిస్తేనే గెలవగలరు. కోదండరామ్ 31శాతం ఓట్లు సాధించాల్సి ఉంది. ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు