Covid 19 Telangana : 24 గంటల్లో 2,982 కేసులు, 21 మంది మృతి

తెలంగాణలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 వేల 982 కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా GHMC పరిధిలో 436 కేసులు రికార్డ్ అయ్యాయి.

Telangana COVID-19 Cases : తెలంగాణలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 వేల 982 కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా GHMC పరిధిలో 436 కేసులు రికార్డ్ అయ్యాయి. నల్గొండ జిల్లాలో 190, రంగారెడ్డిలో 174, కరీంనగర్‌లో 143, పెద్దపల్లి జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో లక్షా 677 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించింది తెలంగాణ ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో రికవరీ రేటు 93 శాతంగా ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 36 వేల 917 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు :

ఆదిలాబాద్ 12. భద్రాద్రి కొత్తగూడెం 118. జీహెచ్ఎంసీ 436. జగిత్యాల 58. జనగామ 36. జయశంకర్ భూపాలపల్లి 49. జోగులాంబ గద్వాల 38. కామారెడ్డి 16. కరీంనగర్ 143. ఖమ్మం 176. కొమరం భీం ఆసిఫాబాద్ 28. మహబూబ్ నగర్ 101. మహబూబాబాద్ 115. మంచిర్యాల 95. మెదక్ 37.

మేడ్చల్ మల్కాజ్ గిరి 153. ములుగు 43. నాగర్ కర్నూలు 60. నల్గొండ 190. నారాయణపేట్ 19. నిర్మల్ 13. నిజామాబాద్ 47. పెద్దపల్లి 129. రాజన్న సిరిసిల్ల 56. రంగారెడ్డి 174. సంగారెడ్డి 66. సిద్ధిపేట 109. సూర్యాపేట 117. వికారాబాద్ 72. వనపర్తి 73. వరంగల్ రూరల్ 79. వరంగల్ అర్బన్ 87. యాదాద్రి భువనగిరి 37. మొత్తం 2,982.

Read More : CM KCR : త్వరలో రైతు బంధు, నకిలీ విత్తన తయారీదారులతో కుమ్మక్కైతే ఉద్యోగాల తొలగింపు

ట్రెండింగ్ వార్తలు