CM KCR : త్వరలో రైతు బంధు, నకిలీ విత్తన తయారీదారులతో కుమ్మక్కైతే ఉద్యోగాల తొలగింపు

రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే రైతు బంధు సాయం వారి వారి అకౌంట్లో వేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖపై 2021, మే 29వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

CM KCR : త్వరలో రైతు బంధు, నకిలీ విత్తన తయారీదారులతో కుమ్మక్కైతే ఉద్యోగాల తొలగింపు

Cm Kcr Review On Department Of Agriculture

Telangana Agriculture : రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే రైతు బంధు సాయం వారి వారి అకౌంట్లో వేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖపై 2021, మే 29వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జూన్‌ 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

నాసిరకం విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ పెట్టాని, ఎంత ధాన్యం వచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. ఇప్పటికే 85 శాతం ధాన్యం సేకరించినట్లు, ధాన్యం సేకరణ విషయంలో ఎఫ్‌సీఐ వివక్ష చూపిస్తోందన్నారు. పంజాబ్‌లో 100 శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్‌సీఐ..తెలంగాణకు వచ్చేసరికి కొర్రీలు పెడుతోందన్నారు. ధాన్యం సేకరణపై ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 25 లక్షల టన్నుల సామర్థ్యానికి పెంచామనే విషయాన్ని గుర్తు చేశారాయన.

భవిష్యత్‌లో 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం చేపడతామని, నకిలీ విత్తనాలపై యుద్ధం ప్రకటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తన తయారీదారులతో జట్టు కడితే..ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఉద్యోగులకు తెలిపారు. అంతేగాకుండా..5 ఏళ్లు జైలు శిక్ష పడే చర్యలుంటాయని హెచ్చరించారు. వెదజల్లే సాగును ప్రోత్సహించాలని, ఈ పద్ధతిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి మిగులుతుంది వ్యవసాయాధికారులకు వివరించారు సీఎం కేసీఆర్‌.

Read More : Angry Teenager: అమ్మ మీద కోపమొచ్చి ఆరేళ్లుగా గొయ్యి తీసి.. అండర్ గ్రౌండ్‌లో ఇల్లు కట్టేసిన టీనేజర్