తెలంగాణలో 3020 కరోనా కేసులు,  99 మంది మృతి

  • Publish Date - June 3, 2020 / 05:09 PM IST

తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 108 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3 వేల 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

బుధవారం (జూన్ 3, 2020)  కరోనా వైరస్ తో ఏడు మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 99 మంది మృతి చెందారు. 1,556 మందికి నయం కావడంతో డిశ్చార్జ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,365 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఆసిఫాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 6  కేసులు , మేడ్చల్‌, సిరిసిల్ల జిల్లాల్లో రెండేసి కరోనా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒకటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.