Fake Visas : శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం..40 మంది మహిళలు అరెస్టు

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం రేపింది. కువైట్ వెళ్లేందుకు 40 మంది మహిళలు ప్రయత్నం చేశారు. వీసాలను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. ఫేక్ అని గుర్తించారు.

Shamshabad

40 women arrested at Shamshabad airport : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం రేపింది. కువైట్ వెళ్లేందుకు 40 మంది మహిళలు ప్రయత్నం చేశారు. వీసాలను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు..ఆ వీసాలు ఫేక్ అని గుర్తించారు.

వెంటనే ఆ 40 మంది మహిళలను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. పోలీసులు మహిళలను ప్రశ్నిస్తున్నారు. ఫేక్ వీసాలతో పట్టుబడిన మహిళలను తమిళనాడు, గోవా, తెలంగాణ, ఏపీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

Farmer Dead : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి

తదుపరి విచారణ కోసం ఆర్జీఐ పోలీసులకు అధికారులు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మహిళలను ఏజెంట్ మోసం చేశాడా? లేదా ఉద్దేశపూర్వకంగానే వెళ్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.