22న GHMC పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

  • Publish Date - May 20, 2020 / 10:11 AM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 22న, కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్‌ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో మూడు బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు  పని చేస్తున్నాయన్నారు. ఈ దవాఖానాలతో ప్రతి రోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి చెప్పారు. నూతన బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. బస్తీ దవాఖానాలో డాక్టరు, నర్సు, సహాయకుడు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు. 

Read: గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు