4976 New Corona Positive Cases In Telangana
new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,646 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4,97,361కి చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 65,757కు పెరిగాయి.
ఇప్పటివరకు 2,739 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 55,358 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.