×
Ad

Marry : ఆయనకు 73.. ఆమెకు 26.. ఔను వాళ్లిద్దరూ.. పెళ్లి చేసుకున్నారు

ఆయన వయసు 73ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య వయసులో భారీ తేడా ఉంది. అయితేనేమీ.. ఇద్దరి మనసులు కలిశాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.

  • Published On : October 14, 2021 / 11:01 PM IST

Marrry

Marry : ఆయన వయసు 73ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య వయసులో భారీ తేడా ఉంది. అయితేనేమీ.. ఇద్దరి మనసులు కలిశాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వృద్ధాప్యంలో తోడు కోసం ఆయన.. భర్తను కోల్పోయి పాప కోసం ఆమె.. వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. నిర్మల్ జిల్లా ముథోల్‌ మండలం చింతకుంట తండాకు చెందిన రాథోడ్‌ కిషన్‌, కుభీర్‌ మండలం రంజని తండాకు చెందిన సునీత భైంసా మండలంలోని దేగాం గ్రామం సాయిబాబా ఆలయంలో కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

రాథోడ్‌ కిషన్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు (73) సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు కూడా చేశాడు. కొన్నేళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన బాగోగులు చూసుకునేవారు ఎవరూ లేకుండా పోయారు.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

ఇక సునీత వయస్సు (26) సంవత్సరాలు. ఆమె భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఒక పాప ఉంది. భర్త చనిపోయినప్పటి నుంచి కూలి పనులు చేస్తూ పాపను పోషించుకుంటోంది. తమ సమీప బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో కిషన్‌, సునీతలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరికి తోడు లేకపోవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. పెళ్లి విషయంలో ఇరు కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అంతేకాదు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు.