Corona Cases : తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు, 33 మంది మృతి

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్‌ వేవ్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Corona Cases In Telangana

new corona cases in Telangana : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్‌ వేవ్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 7,432 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 33 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఒక్క జీహెచ్‌ఎంసీలోనే అత్యధికంగా 1,464 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌లో 606, రంగారెడ్డి 504, నిజామాబాద్‌ 486, ఖమ్మం 325 వరంగల్‌ అర్బన్‌ 323, మహబూబ్‌నగర్‌ 280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజు 1,03,770 పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసులు 3.87లక్షలు దాటాయి. ఇప్పటి వరకు 3.26 లక్షల మంది కోలుకున్నారు.

Read>>>>Rain In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు