784 New Corona Cases Were Reported In Telangana (2)
Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,186 శాంపిల్స్ పరీక్షించారు. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,703కి చేరింది. కరోనా నుంచి నిన్న 1,028 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో 11,455 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ ఎంసీ లో కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి.