×
Ad

Man Burnt Alive : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

కారు యజమాని కోదాడకు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చారు.

  • Published On : November 26, 2023 / 12:42 PM IST

man burned alive

Hyderabad Man Burnt Alive : హైదరాబాద్ ఆదిబట్లసమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు ఆగివున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యారు. కారు యజమాని కోదాడకు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చారు.

మృతుడు వెంకటేష్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు ఆగివున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Sri Sathya Sai : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య

నిన్న రాత్రి కోదాడ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన వెంకటేష్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారును నిలిపివేశారు. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వెంకటేష్ కు అంటుకున్నాయి. దీంతో అతను సజీవ దహనమైనట్లు స్థానికులు చెబుతున్నారు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అయితే అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మానుష్యం ప్రాంతం కావడంతో ఆ సమయంలో అతని రక్షించేందుకు అక్కడ ఎవరూ లేకపోవడంతో మంటలు అంటుకుని వెంకటేష్ సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కారులో చెలరేగిన మంటలపై క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.