ATTACKED
Man Attacked Food Delivery Boy : హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ లో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి 15 మంది అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. 15 మంది అనుచరులతో వచ్చి హోటల్ వద్ద హచ్ చల్ చేశాడు.
భయంతో డెలివరీ బాయ్ హోటల్ లోకి వెళ్లాడు. అయినా యువకులు వదలకుండా హోటల్ లోకి వెళ్లి డెలివరీ బాయ్ పై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ పై మరిగే నూనె పడటంతో డెలివరీ బాయ్ కి తీవ్ర గాయాలయ్యాయి.
డెలివరీ బాయ్ తోపాటు మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. కాగా, పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగిందని హోటల్ సిబ్బంది అంటున్నారు.